Bangaruraju 2 : బంగార్రాజు మ్యూజిక‌ల్ నైట్‌లో హీరోయిన్‌తో క‌లిసి దుమ్మురేపిన చై, నాగ్

Bangaruraju 2: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మ‌రి కొద్ది రోజుల‌లో సినిమా విడుద‌ల కానుండ‌గా, చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

bangarraju musical night event
bangarraju musical night eventbangarraju musical night event

నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నాగార్జున, నాగచైతన్య, అమల, సుశాంత్, సుమంత్ లతో పాటు హీరోయిన్లు కృతి శెట్టి, దక్ష, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. సినిమాలోని పాటలన్నీ హిట్ అయిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఇక వేడుకకు అభిమానులను ఆహ్వానించలేకపోవడం బాధగా ఉందన్న నాగార్జున కుదిరితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తామని అన్నారు.

“బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో అక్కినేని తండ్రీకొడుకులు కలిసి దుమ్మురేపేశారు. అనూప్ రూబెన్స్ రిక్వెస్ట్ తో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి సంక్రాంతి పండగ ఎలా ఉండబోతుందో ఈ వేదికపై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ స్టార్స్ ముగ్గురినీ స్టేజిపైకి పిలిచి మ్యాజిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు.

దానికి ఒప్పుకున్న నాగ్, చైలకు తోడుగా కృతి శెట్టిని కూడా పిలిచాడు అనూప్. ఇక ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సమక్షంలో చై స్టిక్ తో, కృతి శెట్టి గాజులతో, నాగార్జున విజిల్ తో ‘మ్యూజికల్ నైట్’ స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘బంగార్రాజు’ సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ ఈవెంట్ ను నిర్వహించారు.