Bangarraju Collections: బంగార్రాజు దంచి కొట్టాడు.. భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన అక్కినేని హీరోల మూవీ

Bangarraju Collections: ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయ‌క్, సర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాలు సంక్రాంతి బ‌రి నుండి త‌ప్పుకోవ‌డంతో బంగార్రాజు ఆ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, యువ హీరో నాగచైతన్య కలిసి నటించారు. ఇక బంగార్రాజు సినిమా ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 11 కోట్ల రూపాయలు, సీ41డెడ్‌లో 6 కోట్లు, ఉత్తరాంధ్రలో 4. కోట్లు నమోదు చేసింది.

Bangarraju 1st Day Colletions
Bangarraju 1st Day Colletions

ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలో 3.24 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.88 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.60 కోట్లు, కృ.50ష్ణా 2.70 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.50 కోట్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం నైజాం, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 34 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.50 కోట్ల మేర, ఓవర్సీస్‌లో 2.50 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తంగా సుమారు 39 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దాంతో బంగార్రాజు సినిమా 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బంగార్రాజు తొలి రోజున మంచి ఒపెనింగ్స్ లభించాయి. ఆంధ్రా, సీడెడ్‌లో పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. నైజాంలో 60 శాతం ఆక్యుపెన్సీతో బంగార్రాజు రన్ అవుతున్నది. దీంతో నాగార్జున కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

Bangarraju 1st Day Colletions
Bangarraju 1st Day Colletions

తొలి రోజున ఓవర్సీస్‌లో ఈ సినిమాకి మోస్తారు వసూళ్లు కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా 40k డాలర్లు వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు కొల్లగోట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పండగ సీజన్ కావడం, సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో, జీ స్టూడియో సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అనుబ్ రూబెస్స్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలైన బంగార్రాజుకి మొదటి ఆట నుంచి పాజిటివ్‌ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. . ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశ ముందా లేదా అనేది తొలివారాంతంతో తేలిపోతుంది.