Bandla Ganesh: బండ్ల గ‌ణేష్ డ్రామా భ‌లే బాగుంది.. కొద్ది సేప‌టి క్రితం నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌

Bandla Ganesh: బండ్ల గ‌ణేష్ ఏం చేసిన అందులో కొంత స్పెషాలిటీ ఉంటుంది. ఆయ‌న మాట్లాడే మాట‌లు , చేసే ప‌నులు అన్ని కూడా విచిత్రంగా ఉంటాయి.తాజాగా ఆయ‌న మా ఎల‌క్ష‌న్స్‌లో అనుకోని ట్విస్ట్ ఇచ్చాడు. జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను అంటూ కొద్ది సేప‌టి క్రితం ట్వీట్ పెట్టాడు.

Bandla Ganesh Withdrew his Nomination for MAA Polls
Bandla Ganesh Withdrew his Nomination for MAA Polls

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(MAA) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరగనుండగా.. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా విష్ణు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లు పోటీలో ఉండగా మరొకంత మంది అధ్యక్ష ఇతర పదవులకు పోటీ చేయనున్నారు. మొదట్లో అధ్యక్ష పదవికి పలువురి పేర్లు వినిపించగా ప్రధానంగా నలుగురు నామినేషన్లు వేశారు.

ఈనెల 27 నుంచి 29 వరకు నామినేషన్లకు అవకాశం ఇవ్వగా.. 30న వాటిని పరిశీలించారు. నేడు లేదా రేపు స్క్రూటీనీ చేసి ఫైనల్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు.అయితే స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు ఉంటుందని ట్వీట్ రూపంలో క్లారిటీ ఇచ్చేశారు.

‘నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అని బండ్ల గణేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్న బండ్ల గణేష్.. అనుహ్యంగా ఆ ప్యానల్ నుంచి తప్పుకుని స్వతంత్రంగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

జీవిత‌కు పోటీగా నిల‌చున్న బండ్ల సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెర తీశారు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. అటు అధ్యక్ష పదవికి పోటీ ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇప్పటికే తమ ప్యానల్ సభ్యులను ప్రకటించడమే కాకుండా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి బహిరంగంగా మద్దతు ప్రకటించిన పవన్, నాగబాబు లాంటి వారు, బండ్ల గణేష్ చేత నామినేషన్ ఉపసంహరింప చేశారని ప్రచారం నడుస్తుంది.