Bandla Ganesh: బండ్ల గ‌ణేష్‌ని వ‌ద‌లని క‌రోనా.. మ‌రోసారి పాజిటివ్

Bandla Ganesh: దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. మంచు విష్ణు, విశ్వ‌క్ సేన్, మంచు ల‌క్ష్మీ, మ‌హేష్ బాబు, రాజేంద్ర ప్ర‌సాద్ ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా బండ్ల గణేష్ కూడా మరోసారి కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌‌గా నిర్ధారించారు.

Bandla Ganesh Tested Covid Positive for Third Time
Bandla Ganesh Tested Covid Positive for Third Time

బండ్ల గణేష్‌కు ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా కరోనా సోకింది. తొలివేవ్‌లో క‌రోనా బారిన ప‌డి తొందర‌గానే కోలుకున్నాడు. రెండో సారి కరోనా సోకడంతో బండ్ల గణేష్‌ వెంటనే ఆసుపత్రిలో చేరాడు. ఆ స‌మ‌యంలో బండ్లకు చాలా ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఏర్ప‌డిన ఇబ్బందులు గురించి తెలియ‌జేశాడు.

తాజాగా బండ్ల‌కు మ‌రోసారి పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపాడు. గ‌త మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న బండ్ల‌కు ఈ రోజు సాయంత్రం పాజిటివ్‌గా తేలింద‌ని చెప్పాడు. త‌న కుటుంబానికి నెగెటివ్ వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. అంద‌రు జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్ర‌యాణం చేసే ముందు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోండ‌ని పేర్కొన్నాడు.

ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబుకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. వీరే కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

Bandla Ganesh Tested Covid Positive for Third Time
Bandla Ganesh Tested Covid Positive for Third Time

ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది. ఇటు కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది