Minister RK Roja And Bandla Ganesh : మంత్రి రోజా నా సిస్టర్.! ఆమెని చూసి గర్వపడుతున్నా: బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.!
NQ Staff - January 3, 2023 / 12:18 PM IST

Minister RK Roja And Bandla Ganesh : అది చాన్నాళ్ళ క్రితం జరిగిన ఘటన. ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో సినీ నటి, వైసీపీ నేత రోజా అలాగే సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విషయం చాలా దారుణంగా తయారైపోయింది. ‘పక్కలేసుకునే..’ అనే స్థాయికి ఇద్దరూ బూతుల పంచాంగానికి తెరలేపారు.
రోజా నోటి దురుసు అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? బండ్ల గణేష్ మీద రోజా కేసు పెడతానన్నారు. రోజా మీద తాను కూడా కేసు పెడతానంటూ బండ్ల గణేష్ రెచ్చిపోయారు.
ఇప్పుడు.. అన్నా చెల్లెళ్ళు..
అప్పుడలా.! కానీ, ఇప్పుడు సీన్ మారింది. ‘కోపంలో చాలా అంటుంటాం. కోపమొస్తే ఏం మాట్లాడతానో నాకే తెలియదు. ఆ గొడవలు ఇప్పుడేం లేవు. గొడవ జరిగాక ఇద్దరం మాట్లాడుకున్నాం. ఓ వందసార్లు మాట్లాడుకున్నాం, ఫొటోలు దిగాం, కలుసుకున్నాం..’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చాడు బండ్ల గణేష్.
అంతేనా, ‘రోజా నా సిస్టర్.. రోజా సోదరులు నాకు మంచి మిత్రులు.. అన్నా అని ఆప్యాయంగా పిలుస్తాను..’ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
‘సినీ రంగంలో హీరోయిన్గా రాణించి, నానా ఇబ్బందులూ పడి, రెండు సార్లు ఓడిపోయి.. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు మంత్రి అయ్యింది రోజా. ఆమెని చూసి గర్వపడుతున్నా..’ అని బండ్ల గణేష్ చెప్పాడు.