Bandla ganesh: పుష్ప సినిమాపై కుల వివాదం..అదిరిపోయే పంచ్ ఇచ్చిన బండ్ల గ‌ణేష్‌

Bandla ganesh:: అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ సినిమా గ‌త‌ నెల 17న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ వంటి విభిన్న‌ క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమా ఆలిండియా రికార్డు స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతోంది. హిందీ మిన‌హా ఇత‌ర భాష‌ల్లో ఈ సినిమా ఇప్ప‌టికే ఓటీటీలోనూ విడుద‌లైంది. 2021లో భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

bandla ganesh fire on ycp leader
bandla ganesh fire on ycp leader

పుష్ప సినిమా రిలీజ్ సమ‌యంలొ ప‌లు వివాదాలు చుట్టుముట్ట‌గా, తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీకి అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌విచంద్రా రెడ్డి.. పుష్ప సినిమాకు సంబంధించి వివాదాస్పద విష‌యాన్ని లేవ‌నెత్తారు. ఇందులో విల‌న్లు, చెడ్డ ప‌నులు చేసేవాళ్లంద‌రి పేర్లూ రెడ్లే అని.. పుష్ప నిర్మాత అయిన ర‌విశంక‌ర్ క‌మ్మ కుల‌స్థుడు కావ‌డంతో ఉద్దేశ‌పూర్వ‌కంగా రెడ్ల‌ను కించ‌ప‌రిచేలా ఇందులో విల‌న్ పాత్ర‌ధారుల్ని రెడ్లుగా చూపించార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ సినిమా నిర్మాతలు చంద్రబాబు నాయుడు కి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని, హీరో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అని, చంద్రబాబునాయుడు భావజాలాన్ని కావాలనే ఈ నిర్మాతలు ప్రజల పై రుద్దుతూ ఉన్నారు అని, ఉద్దేశపూర్వకంగానే విలన్లకు రెడ్డి పేర్లు పెట్టారని రవిచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు . అయితే సినీ పరిశ్రమ తరపున బండ్లగణేష్ వైకాపా అధికార ప్రతినిధి కి బలమైన కౌంటర్ ఇచ్చారు.

గతంలో బాలకృష్ణ సమరసింహా రెడ్డి అన్న సినిమా తీశారని అందులో నటించిన హీరో బాలకృష్ణ మరియు దర్శకుడు బి.గోపాల్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టి హీరోయిజం ఎలివేట్ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా చిరంజీవి ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించారని నిర్మాత అశ్వినీదత్ కమ్మ సామాజిక వర్గం చిరంజీవి కాపు సామాజిక వర్గం అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టారని గుర్తు చేశారు ‌ అంతేకాకుండా సైరా నరసింహారెడ్డి పేరుతో చిరంజీవి సినిమా తీసినప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకు ఇవన్నీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు బండ్ల గణేష్.

మరో ప్రక్క ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా లేక‌పోవ‌డంతో పుష్ప రాజ్‌ త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. సుకుమార్ త‌న‌దైన రీతిలో సినిమాను తెర‌కెక్కించ‌డం, అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్‌ ఫాజిల్, సునీల్, అన‌సూయ వంటి వారి న‌ట‌న ఈ సినిమా ఇంతటి భారీ క‌లెక్ష‌న్లు సాధించ‌డానికి కార‌ణ‌మైంది.

Pushpa: The Rise Box Office: The Allu Arjun starrer goes over Rs. 2 crore  mark again, aims for Rs. 95-100 cr finish :Bollywood Box Office - Bollywood  Hungama

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.క‌రోనా స‌మ‌యంలోనూ పుష్ప దూసుకుపోతోంద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ అన్నారు. ఈ సినిమా హిందీలో గ‌త‌ శుక్ర‌వారం రూ.1.95 కోట్లు, శ‌నివారం రూ.2.56 కోట్లు, ఆదివారం రూ.3.48 కోట్లు రాబ‌ట్టింద‌ని ఆయ‌న చెప్పారు. మొత్తానికి రూ.80.48 కోట్లు సాధించింద‌ని వివ‌రించారు.