Bandla Ganesh: వాళ్ల‌ను టార్చ‌ర్ పెట్ట‌డ‌మే నా ప‌ని: బండ్ల గ‌ణేష్‌

Bandla Ganesh: అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు అంతా సిద్ధం అయింది. పోటీ చేసే వాళ్లు నామినేష‌న్స్ వేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఇక జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

Bandla Ganesh Fire on Maa Elections
Bandla Ganesh Fire on Maa Elections

అనంతరం మీడియాతో మాట్లాడిన బండ్ల గ‌ణేష్‌.. ప‌లు విష‌యాల గురించి చెప్పారు.ఇప్పుడు అంద‌రు మాట‌లు చెబుతున్నారు. కాని అవి చేత‌ల‌లో చూపించ‌డం క‌ష్టం. త‌ప్పుడు ప్రామిస్‌లు చేయ‌ను. ఇండస్ట్రీకి మా బిల్డింగ్ అవసరం లేనేలేదన్నారు. ఇప్పుడున్న ఆఫీస్ చాలన్న గణేష్ కొందరు కావాలనే ప్రలోభ పెడుతున్నారన్నారు. ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని బండ్ల గణేశ్ అన్నారు.

గెలిచిన వాళ్ల‌ను నేను వ‌దిలి పెట్ట‌ను. ప‌నులు చేసే వ‌ర‌కు వాళ్ల‌ను టార్చ‌ర్ పెట్ట‌డ‌మే నా ద్యేయం. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌లో నేను ఉన్నా కూడా చేయ‌ని ప‌నుల‌ను చేస్తానంటే నేను ఒప్పుకోను. పేద క‌ళాకారుల‌కు డ‌బుల్ ఇండ్లు అందించ‌డ‌మే నా ధ్యేయం అంటూ బండ్ల గ‌ణేష్ చెప్పుకొచ్చారు. ప‌ర‌మేశ్వ‌రుడి ద‌య వ‌ల‌న తాను త‌ప్ప‌క గెలుస్తాన‌ని చెప్పుకొచ్చాడు.