Bandla Ganesh: విందుల పేరుతో మ‌మ్మ‌ల్ని చంపొద్దు.. బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bandla Ganesh: బండ్ల గణేష్ కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని టార్గెట్ చేస్తారో ఆయ‌న‌కు కూడా తెలియ‌దు. రీసెంట్‌గా న‌రేష్‌.. సాయి తేజ్ యాక్సిడెంట్‌పై స్పందించ‌గా, దానిపై బండ్ల గణేష్ కౌంట‌ర్ ఇచ్చాడు.తన కుమారుడు నవీన్, తేజూ మంచి స్నేహితులని చెప్పిన నరేష్.. బైక్ రైడింగ్ విషయంలో వాళ్ళిద్దరినీ పలు సార్లు హెచ్చరించానని అన్నారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటి నుంచే సాయి ధరమ్ తేజ్ బయలుదేరి వెళ్లాడని, ఇంతలోనే యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు.

Bandla Ganesh Comments over Celebrities who criticised Sai Dharam Tej Accident
Bandla Ganesh Comments over Celebrities who criticised Sai Dharam Tej Accident

కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కుమారుల యాక్సిడెంట్ టాపిక్ కూడా తీయ‌డంతో బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ఓ వీడియో ద్వారా షాకింగ్ కామెంట్స్ చేశారు.నరేష్ గారు మీరు.. ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వారి పేర్లు చెప్పడం కానీ, మీరలా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు. ఇప్పుడెందుకు సార్.. రేసింగ్ చేశాడు, మీ ఇంటి దగ్గరికి వచ్చాడు అనే అంశాలు. ఇట్లాంటి సమయంలో ఆ పరమేశ్వరుని వేడుకొని ప్రమాదంలో ఉన్న వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకోవాలి అని అన్నారు.


తాజాగా బండ్ల గ‌ణేష్ ..ప్రకాష్ రాజ్ విందు రాజకీయాలు చేయడంపై మండిప‌డ్డారు. ఆ మ‌ధ్య నరేష్ తన మెంబర్స్‌తో ఓ హోటల్‌లో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా తన ప్యానల్ మెంబర్స్‌తో విందు ఏర్పాటు చేశారు. “ప్రియమైన సిని”మా” బిడ్డలకు… కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం… ప్రతిష్ఠని, పటిష్టతని పెంచే దిశగా…మన లక్ష్యాలు మాట్లాడుకుందాం… మాట్లాడుకున్నాక సహపంక్తి భోజనం చేద్దాం.. అంటూ ఓ ఇన్విటేషన్ ను పంపారు.


దీనిపై ట్విట్టర్ వేదికగా బండ్ల మండిప‌డ్డారు.. లంచ్‌లు డిన్నర్ల పేరుతో మా సభ్యులను ఒక చోట చేర్చడంపై బండ్ల గణేష్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి మా కళాకారులను విందులు , సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరం కరోనా భయంతో బ్రతుకుతున్నాం.. చాల మంది చావుదాకా వెళ్లివచ్చారు. అందులో నేను ఒకడిని.. ఓటు కావాలంటే ఫోన్‌ చేసి, మీరు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి.


అంతే కానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి మా ప్రాణాలతో చెలగాటమడోద్దు.. అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.ప్ర‌స్తుతం ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్‌లో ఉన్న జీవిత‌పై విజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు బండ్ల‌.