NTR : ఎన్టీఆర్ ‘దేవర’ టైటిల్‌ పై బండ్లన్న కామెంట్‌

NQ Staff - May 19, 2023 / 10:38 PM IST

NTR : ఎన్టీఆర్ ‘దేవర’ టైటిల్‌ పై బండ్లన్న కామెంట్‌

NTR : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ విషయమై ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ తో ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.

గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ తో దేవర అనే సినిమాను తీయబోతున్నట్లుగా బండ్ల గణేష్ ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆ టైటిల్ ని బండ్ల గణేష్ రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు.. కానీ ఈ మధ్య కాలంలో ఆయన రెన్యువల్ చేయడంలో విఫలమయ్యాడు.

బండ గణేష్ ఆ విషయం మర్చి పోవడంతో వెంటనే ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ఆ టైటిల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవర టైటిల్ ని ఎన్టీఆర్ సినిమాకు రిజిస్టర్ చేయడం పట్ల బండ్ల గణేష్ స్పందించాడు.

తనకు ఎన్టీఆర్ కూడా దేవర.. కనుక ఈ టైటిల్ ని ఎన్టీఆర్ సినిమాకు పెట్టడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదు.. అభ్యంతరం లేదు అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ టైటిల్ ని ఎన్టీఆర్ కి వాడుతున్నారని కాపీ కొడుతున్నారని కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ దేవర సినిమా చేసి ఉంటే బాగుండేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు మాత్రం ఎన్టీఆర్ సినిమాకు దేవర టైటిల్ పెట్టడం పట్ల పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us