Bandla Ganesh: పొలం కొన‌మ‌ని చెబితే నాగార్జున ఇలా అన్నారు..బండ్ల గ‌ణేష్ కామెంట్స్ వైర‌ల్

Bandla Ganesh: ఇప్పటికీ టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా అభిమానుల‌తో పిలిపించుకుంటున్న నాగార్జున ఆగ‌స్ట్ 29న 62వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ అందించారు. ట్విట్ట‌ర్ స్పేస్‌లో నాగ్‌తో ఉన్ననుబంధాన్ని ప‌లువురు పంచుకున్నారు.


Bandla Ganesh Comments on King Nagarjuna
Bandla Ganesh Comments on King Nagarjuna


నాగార్జున బర్త్ డే సందర్భంగా కోన వెంకట్, బీవీఎస్ రవి, బండ్ల గణేష్, చందూ మొండేటి, బ్రహ్మాజీ వంటివారు నాగార్జున‌తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోగా, అంద‌రిక‌న్నా భిన్నంగా బండ్ల గ‌ణేష్ కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. డాన్ సినిమా సందర్భంలో ఓ సారి నాగార్జున గారిని పొలం కొనమని, షాద్ నగర్‌లో రేట్లు బాగున్నాయని స‌ల‌హా ఇచ్చాను. అయితే దానికి నాగార్జున షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు.


నాకు ఇప్పుడు 40 ఏళ్లు దాటాయ్.. ఇక వాటిని కొనుక్కుని సాగులోకి తెచ్చే సరికి 60 ఏళ్లు వస్తాయ్.. అవి నాకు అవసరమా?.. అని నాగార్జున అన్నారట. నాగార్జున గారు ఎప్పుడు ఎలా బతకాలో ముందే నిర్ణయించుకున్నారు. 40 ఏళ్లలో ఎలా బతకాలి.. 50 ఏళ్లకు ఎలా బతకాలి.. 60 ఏళ్లకు ఎలా బతకాలి ఇలా ముందే నిర్ణయించుకున్నారు.. ఆయన జీవితాన్ని ముందే డైరీలో రాసుకున్నారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.


అక్కినేని అభిమానులకు నాగార్జున త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా డబుల్‌ ధమాకా అందించారు! ఒకటి మాస్‌… ఇంకొకటి క్లాస్‌… ఓ చిత్రంలో డెవిల్‌గా, మరో చిత్రంలో ఘోస్ట్‌గా మన్మథుడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ద ఘోస్ట్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. ఆదివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు.


కుమారుడు నాగచైతన్యతో కలిసి నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఇందులో నాగార్జున ఫస్ట్‌లుక్‌నూ ఆదివారం విడుదల చేశారు. అందులో ‘ద డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని పేర్కొన్నారు. ‘బంగార్రాజు’లో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతీ శెట్టి నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.