ఈడీ కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మైన బండ్ల గ‌ణేష్‌.. అందరిలో అనేక అనుమానాలు

టాలీవుడ్ లో కొన్నేళ్ల కిందట కలకలం రేపిన డ్రగ్స్ కేసు వ్యవ‌హారాన్ని మ‌ళ్లీ త‌వ్వారు.దాదాపు 12 మంది సెల‌బ్రిటీల‌ను ఈ రోజు నుండి ఈడీ విచారించ‌నుంది. ముంద‌గా పూరీ జ‌గ‌న్నాథ్‌ని ఈడీ విచారిస్తుంది. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి రాగా, ఏకబిగిన 8 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Bandla Ganesh at ED Office
Bandla Ganesh at ED Office

మ‌ధ్య‌లో కాసేపు భోజన విరామం ఇచ్చిన ఈడీ అధికారులు ఆయ‌న‌ని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. పూరీ జగన్నాథ్ నేటి విచారణకు తన చార్టర్డ్ అకౌంటెంట్ తో కలిసి విచ్చేశారు. గత ఆరేళ్ల కాలానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను ఆయన ఈడీ అధికారులకు అందజేశారు. 2015 నుంచి ఇప్పటివరకు జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు పూరీ జగన్నాథ్ ను పలు విధాల ప్రశ్నించారు.

ముఖ్యంగా, విదేశీ లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంక్ ఖాతాలు పరిశీలించే అవకాశం ఉంది. అయితే బండ్ల గ‌ణేష్ ఈడీ కార్యాల‌యంలో ప్ర‌త్య‌క్షం అయ్యే స‌రికి అంద‌రిలో అనేక అనుమానాలు మొద‌ల‌య్యాయి.

12 మందికి సంబంధించిన లిస్ట్‌లో బండ్ల గ‌ణేష్ లేక‌పోయిన ఆయ‌న ఈడీ ఆఫీసుకి ఎందుకు వ‌చ్చాడ‌బ్బా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలో బండ్ల గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ.. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చాను అని స్ప‌ష్టం చేశారు.

30 ఏళ్ల ఫ్రెండ్షిప్ మా ఇద్ద‌రిది. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా ఉండేందుకు వ‌చ్చా. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయోద్దు. నాకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అసలు నాకెందుకు నోటీసులు ఇస్తారని బండ్ల గణేశ్ ప్రశ్నించారు. పూరీ,బండ్ల కాంబినేష‌న్‌లో టెంపర్ చిత్రం రూపొంది మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో వ్యవహారంలో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.