Bandla Ganesh: బండ్ల గణేష్.. బండ తప్పులు..

Bandla Ganesh బండ్ల గణేష్.. జోకర్ (కమెడియన్) లెవల్ నుంచి నిర్మాత స్థాయికి ఎప్పుడో చేరుకున్న వ్యక్తి. అయితే ప్రొడ్యూజర్ గా కన్నా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగానే బాగా పాపులర్. స్టేజీ మీద మైక్ దొరుకుతుందంటే చాలు పవర్ స్టార్ గొప్పతనాన్ని పీక్స్ లోకి తీసుకెళ్లటానికి బాగా ప్రిపేరై వస్తాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటాడు. కానీ అప్పుడప్పుడూ తన పోస్టింగుల్లో తప్పులో కాలేస్తుంటాడు. ఒక్కోసారి ఇంగ్లిష్ స్పెల్లింగ్ మిస్టేక్ లు.. మరోసారి బండ మిస్టేక్ లు చేస్తుంటాడు. ఇవాళ ఆదివారం కూడా అదే జరిగింది. తాను ఇన్ స్టాగ్రామ్ అనే మరో సామాజిక మాద్యమంలో సైతం అందుబాటులోకి వచ్చానని ట్విట్టర్ లో పొద్దునెప్పుడో పేర్కొన్నాడు. ‘‘హలో ఫ్రెండ్స్.. ఇది నా ఇన్ స్టా అకౌంట్. ప్లీజ్ ఫాలో.. ఇట్లు గణేష్ బండ్ల’’ అని రాసుకొచ్చాడు.

 

ఫాలో కావటానికి లింకేది?..

దయచేసి నన్ను ఫాలో అవ్వండి అంటూ రిక్వెస్ట్ చేసిన బండ్ల గణేష్.. ఫ్యాన్స్ ఫాలో కావటానికి కావాల్సిన ఇన్ స్టాగ్రామ్ లింక్ ని షేర్ చేయటం మర్చిపోయాడు. అది గమనించి మొదటి ట్వీట్ ని డిలీట్ చేశాడు. రెండోసారి పోస్టు పెట్టినా అప్పుడూ లింక్ పెట్టలేదు. మూడోసారి సైతం అదే తప్పు చేశాడు. దీంతో నెటిజన్లు అతణ్నిగట్టిగా పట్టేసుకున్నారు. ‘ఏంటన్నా ఇది?. ఏం చేస్తున్నావు నువ్వు?.. ఇన్ స్టాగ్రామ్ లింక్ ఏది?. ట్వీట్లను ఎందుకు డిలీట్ చేస్తున్నావ్?. మళ్లీ ఎందుకు పెడుతున్నావ్?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకరైతే ‘‘లింక్ ఎక్కడరా లఫూట్’’ అని ఘోరంగా తిట్టాడు. ఎట్టకేలకు ఎవరో ఒక మిత్రుడు ఆ లింక్ ని షేర్ చేయటంతో గొడవ సద్దుమణిగింది.

మళ్లీ అదే ధ్యాస..

బండ్ల గణేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మొత్తమ్మీద మూడు పోస్టులు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఆయన ఆరాధ్య దైవం లాంటి పవన్ కళ్యాణ్ ది. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నవ్వుతూ ఉన్న పవర్ స్టార్ ఫొటోని తొలిసారి పోస్ట్ చేశాడు. దాని పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. అది కూడా దాదాపు అదే ఫంక్షన్ కి సంబంధించిన ఫొటో. ఇక మూడో ఫొటో గురించి చెప్పుకోవాలి. బండ్ల గణేష్ కి ఈమధ్య రెండోసారి కరోనా వైరస్ సోకింది. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించారు. మొత్తానికి ఆ మహమ్మారి నుంచి బయటపడ్డట్లున్నాడు. కానీ.. మొహంలో మునుపటి కళ తప్పింది. ఇంకా పూర్తిగా కోలుకోలేదని కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Advertisement