Bandla Ganesh :నటుడు, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ వీర భక్తుడిగా చెప్పుకునే బండ్ల అప్పుడప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటాడు. సినిమా ఈవెంట్స్ లో బండ్ల గణేష్ అద్భుతమైన ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ పై వైవిధ్యమైన ప్రశంసలతో బాగా పాపులర్ అయ్యారు.
చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ నటుడిగా ఇటీవల ఓ ప్రయోగం చేశారు. బండ్ల గణేష్ నటించిన ‘డేగల బాబ్జీ’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డేగల బాబ్జీ చిత్రం తమిళంలో విజయం సాధించిన ఒత్త సెరప్పు సైజు 7 అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బండ్ల గణేష్ యాంకర్ సుమ నిర్వహించే క్యాష్ షోలో పాల్గొన్నారు.
ఈ షో మే 28న ప్రసారం కానుంది. షోలో సుమపై బండ్ల గణేష్ అదిరిపోయే పంచ్ లు వేశాడు. తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ గా మారింది. బండ్ల గణేష్ తోపాటు దర్శకుడు వెంకట్ చంద్ర, నటుడు సమీర్ కూడా ఈ శ్లో పాల్గొన్నారు. బండ్ల గణేష్ కి పోల్ట్రీ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో బండ్ల గణేష్ సుమ అందంగా ఉండడానికి కారణం తాను పంపిన కోడి గుడ్లు అంటూ సెటైర్లు వేశాడు.
దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే.. మీ గురించి కోరుకుంటారా లేక పవన్ కళ్యాణ్ గురించా అని సుమ ప్రశ్నించింది. దీనితో బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి.. అప్పుడు నేను కూడా బావుండాలి అని కోరుకుంటాను అని సమాధానం ఇచ్చాడు. ఇక మీరు కోవిడ్ వల్ల బాగా ఇబ్బంది పడ్డారు అట కదా అని సుమ ప్రశ్నించింది. దీనిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నన్ను మూడు వేవ్ లు టచ్ చేశాయి.
ముఖ్యంగా సెకండ్ వేవ్ లో కరోనా సోకినప్పుడు బాగా ఇబ్బంది పడ్డాను. సీరియస్ అయింది. ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు చొరవ తీసుకుని నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చిరంజీవి గారు చూపించిన కేర్ ఎప్పటికి మరచిపోలేను. ఆయన లేకపోతే పరిస్థితి ఏంటి అన్నట్లుగా బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.
- Advertisement -
ఆ మధ్య కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. రెండోసారి కరోనా బారిన పడిన సమయంలో ఆరోగ్యం క్షీణించిందని, ఒక్కరోజు ఆలస్యమైనా కూడా తన ప్రాణాలు పోయేవని.. అలాంటి కఠిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనకు అండగా నిలిచారని బండ్ల గణేష్ అన్నారు. తనతో పాటు తన ఇంట్లో వాళ్లందరికీ కరోనా సోకిందని, ఆ సమయంలో కనీసం ఆసుపత్రిలో బెడ్ కూడా దొరకని పరిస్థితి ఉందని చెప్పిన ఆయన.. పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేయాలని అనుకుంటే అప్పుడు ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి చేయలేకపోయానని అన్నారు.
చివరకు చిరంజీవి గారికి ఫస్ట్‌టైమ్ చేశానని, నోట మాట కూడా రాని ఆ పరిస్థితుల్లో ఆ ఒక్క ఫోన్ కాల్‌తో చిరంజీవి ఎంతో సాయపడ్డారని బండ్ల గణేష్ తెలిపారు. చిరంజీవి చేసిన ఆ సాయంతోనే ఇవ్వాళ మీ ముందు ఉన్నాను తప్ప, లేకుంటే వేరేలా ఉండేదని అన్నారు. పవన్ కళ్యాణ్ నాకు ఒక జీవితాన్ని ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని ఆయన చెప్పడం విశేషం.