Bandla : బండ్ల గణేష్ కి సీరియస్

Bandla : గతంలో కమెడియన్, తర్వాత ప్రొడ్యూసర్, మధ్యలో కొన్నాళ్లు పొలిటీషియన్, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్న బండ్ల గణేష్ మరోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన గతేడాది కొవిడ్-19 ఫస్ట్ వేవ్ లోనూ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య ‘వకీల్ సాబ్’ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ లో వీరావేశంతో మాట్లాడి ఆ కార్యక్రమానికే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన బండ్ల గణేష్ కి రెండోసారి కూడా కరోనా ఎటాక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని హైదరాబాద్ జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఫివర్, ఇతర కొవిడ్ వైరస్ వ్యాధి లక్షణాలతో బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించాల్సి ఉంది. బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు గానీ ఆస్పత్రి వర్గాలు గానీ కన్ఫర్మేషన్ చేస్తే తప్ప క్లారిటీ రాదు.

Bandla : bandla ganesh joined apollo hospital with corona
Bandla : bandla ganesh joined apollo hospital with corona

‘‘దేవుడు’’దీ అదే పరిస్థితి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ సాక్షూత్తూ ఒక దేవుడిగా భావిస్తారు. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు సినిమా మీటింగుల్లో పబ్లిక్ గా, సగర్వంగా ప్రకటించారు. అయితే ఆ దేవుడు కూడా ఇప్పుడు క్వారంటైన్ కే పరిమితం కావాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ పర్సనల్, సెక్యూరిటీ సిబ్బందిలో చాలా మందికి కరోనా మహమ్మారి అంటుకోవటంతో ఆయన మొన్నటి నుంచి హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. మరో వైపు ‘వకీల్ సాబ్’ నిర్మాత దిల్ రాజుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలటంతో హోం ఐసోలేషన్ విధించుకున్నారు. దిల్ రాజుకి కొవిడ్-19 లక్షణాలు బయటికి కనిపించకపోయినా పాజిటివ్ గా తేలారు.

ఇండస్ట్రీ మొత్తం: Bandla

తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం చాలా మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కథా రచయిత విజయేంద్రప్రసాద్, డైరెక్టర్లు త్రివిక్రమ్, గుణశేఖర్, వీఎన్ ఆదిత్య, హీరోయిన్ నివేదా థామస్ తదతరులు ఈ జాబితాలో ఉన్నారు. కరోనా మూలంగా లవ్ స్టోరీ, టక్ జగదీశ్ వంటి కొన్ని తెలుగు సినిమాల విడుదల సైతం వాయిదా పడ్డాయి. చిరంజీవి మూవీ ‘ఆచార్య’ సైతం అదే దారిలో నడిచే అవకాశం ఉందంటున్నారు.

Advertisement