Bandi Sanjay: విష్ణు గెలుపుని ఎంజాయ్ చేస్తున్న బండి సంజ‌య్..!

Bandi Sanjay: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నిక‌ల‌లో మంచు విష్ణు భారీ విజ‌యం సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. మా ఎన్నిక‌లు సినిమా ప‌రిశ్ర‌మే కాదు రాజ‌కీయ వ‌ర్గాల‌లోను ఆస‌క్తిని రేకెత్తించాయి. మంచు విష్ణు.. ప్ర‌కాశ్‌రాజ్‌పై విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషంలో మునిగిపోయారు.

Bandi Sanjay Expressed His Hapinees Over winning of MAA Elections by Manchu Vishnu
Bandi Sanjay Expressed His Hapinees Over winning of MAA Elections by Manchu Vishnu

మొదటి నుండి మా ఎన్నికలు రాజకీయ నాయకులతో సహా చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల పరిణామాలను ఆసక్తిగా గమనించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తాజాగా మంచు విష్ణుకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రకాష్ రాజ్ను ఓడించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచినందుకు మంచు విష్ణుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు బండి.

రెండు ప్యానెల్లలో విజేతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఓడించినందుకు మా ఓటర్లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పనికిరాని గ్యాంగ్కు ఓటర్లు పాఠం నేర్పించినందుకు సంతోషంగా ఉంది” అని బండి సంజయ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

“రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మా ఓటర్ల నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. నేను అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ” అని తెలిపారు. సీవీఎల్‌కి బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌గా, త‌మ పార్టీపై గ‌తంలో విమ‌ర్శ‌లు చేసిన ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోవాల‌ని కోరుకుంటున్న సంజ‌య్ గ‌తంలో తెలిపారు.

సీవీఎల్ బండి సంజయ్ ఆరోపణల ప్రకారం ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకి. నరేంద్ర మోడీ -బిజెపికి వ్యతిరేకంగా అతని సిద్ధాంతాలతో సహా అనేక కారణాల వల్ల విమర్శించారు. అందుకే ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో బీజేపీ బ్యాచ్ హ్యాపీ గా ఉంది.