Ban On Movies Review At Prasad Multiplex : ఆదిపురుష్ ఎఫెక్ట్.. ఇకపై ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద రివ్యూలకు నో ఛాన్స్..!

NQ Staff - June 30, 2023 / 09:31 AM IST

Ban On Movies Review At Prasad Multiplex : ఆదిపురుష్ ఎఫెక్ట్.. ఇకపై ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద రివ్యూలకు నో ఛాన్స్..!

Ban On Movies Review At Prasad Multiplex :

మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి మామూలుగా ఉండదు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టే ఊగిపోతుంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ అంటే పివిఆర్, ఐనాక్స్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పాపులర్ అయ్యాయి. అందులోనూ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వద్ద ఉండే హంగామా అంతా ఇంతా కాదు.

ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద జాతరలా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ప్రేక్షకుల నుంచి రివ్యూలు తీసుకునేందుకు యూట్యూబ్ ఛానెల్ వాళ్లు, కొన్ని మీడియా ఛానెల్ వాళ్లు ఎగబడుతూ ఉంటారు. వందల కొద్దీ యూట్యూబ్ ఛానెల్ వారు రివ్యూలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.

అలా వారందరితో కోలాహలంగా ఉంటుంది. అలాంటి ప్రసాద్ మల్టీ ప్లెక్స్ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ థియేటర్ వద్ద రివ్యూలు తీసుకోవడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. ఎందుకంటే ఈ రివ్యూల కారణంగా కొన్ని సార్లు గొడవలు కూడా జరుగుతున్నాయి.

మొన్న ఆదిపురుష్ సినిమా సమయంలో ఓ వ్యక్తి నెగెటివ్ రివ్యూ ఇస్తే ప్రభాస్ ఫ్యాన్స్ చితక్కొట్టడం కూడా మనం చూశాం. దాంతో యాజమాన్య అలర్ట్ అయింది. పెద్ద ఎత్తున గొడవలు జరగకుండా ఉండాలంటే రివ్యూలు ఆపేయాలంటే నిర్ణయం తీసుకుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us