Veera Simhareddy : బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది
NQ Staff - January 9, 2023 / 04:21 PM IST

Veera Simhareddy : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తారీఖున ప్రత్యేకమైన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాక పోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ని సెన్సార్ బోర్డు ఇవ్వడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా యొక్క సెన్సార్ టాక్ పాజిటివ్ గా రావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వీర సింహారెడ్డికి సెన్సార్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా చూశారు. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమా కి పాజిటివ్ రివ్యూ ఇచ్చారంటూ సమాచారం అందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ జోడిగా శృతిహాసన్ నటించిన నటించింది.