Akhanda : అఖండ తర్వాత ఫన్ డైరెక్టర్‌తో బాలయ్య..!

Akhanda : అఖండ..ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య – బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి ఎంతటి కమర్షియల్ హిట్ సాధించాయో అందరికి తెలిసిందే. ఈ క్రమంలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు సహజంగానే నెలకొన్నాయి.

balayya with fun director after akhanda
balayya with fun director after akhanda

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన టైటిల్ రోర్ 50మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయో సినిమాలకి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం.

Akhanda : అఖండ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ సినిమా..?

ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్ జోరుగా సాగుతోంది. సమ్మర్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ సినిమా ఒకటి చేయనున్నట్టు సమాచారం. బాలయ్యకి కథ కూడా విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు రానుందో.

Advertisement