BALA KRISHNA: బాబోయ్ ర‌జ‌నీకాంత్‌నే టార్గెట్ చేసిన బాల‌కృష్ణ‌.. ఫ్యాన్స్ అంతా షాక్..!

బాలయ్యకు సరైన సినిమా పడక చాలా ఏళ్ల పాటు ఆయన అలా ఉండిపోతాడు కానీ ఒక్కసారి ఆయన గర్జించాడంటే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. ఇక్కడ వచ్చిన సమస్యల్లా బాలయ్య ఇమేజ్ ను తెలుగులో సరిగ్గా బ్యాలెన్స్ చేసే దర్శకులు చాలా అరుదుగా ఉన్నారు. చాలా మంది డైరెక్టర్స్ ఆయన ఇమేజ్ అందుకోలేక ఫ్లాప్ సినిమాలు ఇస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో బాలయ్యను ఆయన కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ. మొన్న విడుదలైన టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. గతంలో బాలయ్య సినిమాలు ఏవీ కూడా కనీసం కలలో కూడా సాధించని రికార్డులను ఈ టీజర్ సాధిస్తుంది.

ఇంకా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో అఖండ టీజర్ దుమ్ము దులిపేస్తుంది. యూట్యూబ్ లో ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు చూసి నోరెళ్లపెడుతున్నారంతా. బాలయ్య కొత్త గెటప్ లో కనిపించడం.. యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోవడం.. డైలాగులు పేలిపోవడంతో అఖండ టీజర్ ట్రెండింగ్ అవుతుంది. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్ కు ప్రాణం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టీజర్ రజినీకాంత్ రికార్డులను కూడా బద్ధలు కొట్టేలా కనిపిస్తుంది. ఇప్పటికే 35 మిలియన్లకు పైగా వ్యూస్.. 390K+ లైక్స్ రాబట్టి టాలీవుడ్ సీనియర్ హీరోల రికార్డులను బ్రేక్ చేసింది అఖండ టీజర్. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలు ఈ లిస్టులో చాలా వెనకాలే ఉండిపోయాయి.

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమా టీజర్ రికార్డును బద్దలు కొట్టింది అఖండ టీజ‌ర్‌. ఈ టీజర్ అప్పట్లో 38 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దక్షిణాది సీనియర్ స్టార్ హీరోల సినిమాల టీజర్స్ లో ఇదే అత్యధిక వ్యూస్. ఇప్పుడు బాలయ్య ‘అఖండ’ టీజర్ విడుదలైన 11 రోజుల‌లోనే అది బ్రేక్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. బాలయ్య స్పీడ్ చూస్తుంటే రానున్న రోజుల్లో అన్ని రికార్డుల‌ను ఫసక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ‘అఖండ’ సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement