Annapurna Studios: అన్న‌పూర్ణ స్టూడియోలో బాల‌య్య టాక్ షో ప్రోమో షూటింగ్.. సెల‌బ్స్ లిస్ట్ పెద్ద‌దే..!

Annapurna Studios: కరోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్లు మూతపడటం,ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల గిరాకీ పెర‌గ‌డంతో స్టార్ హీరోలు సైతం ఓటీటీలో తెగ సంద‌డి చేస్తున్నారు. నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఆహాలో టాక్ షో చేయ‌నున్నాడ‌ని కొన్నాళ్లు ప్రచారం న‌డుస్తుంది. రానా, సమంతాలతో పలు షోలు చేసిన ఆహా.. త్వరలో నందమూరి బాలకృష్ణతో ఓ షో ప్లాన్ చేసింది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో గురించి ఇప్పటికే టాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది.

Balayya Talk Show Promotions are taking Place in Annapurna Studios
Balayya Talk Show Promotions are taking Place in Annapurna Studios

బాలయ్య హోస్ట్ గా చేయనున్న ఈ షో కి అన్ స్టాపబుల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. బాలయ్య హోస్ట్ గా షో చేయడమంటే మామూలుగా ఉండదు.. దబిడి దిబిడే. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో అన్న‌పూర్ణ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ట‌.త్వ‌ర‌లోనే దీనిని టెలికాస్ట్ చేయ‌నున్నారు.

చాల‌మంది టాలీవుడ్ సెల‌బ్స్ ఈ షోకి హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌భాస్ ఇలా చాలా మంది సెల‌బ్రిటీలు షోలో తెగ ర‌చ్చ చేయ‌నున్నార‌ని అంటున్నారు . ఆహా సంస్థ బాలకృష్ణను ఒక షో చేయమని అప్రోచ్ కాగా ఆ కాన్సెప్ట్ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

బాలకృష్ణ ఈ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఉండగా ఆయన హోస్ట్ గా కూడా మొట్టమొదటిసారిగా వ్యవహరిస్తున్నారు. చేసే ప్రతి ఎపిసోడ్ అలాగే వచ్చే ప్రతి గెస్ట్ ని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేయడానికి ఆహా నిర్వాహకులు భావిస్తున్నారు.