Unstoppable : ఆఫ్ స్క్రీన్‌లో జరిగింది ఇదే.. షోకు ముందు రెండు చేతులు జోడించి న‌మ‌స్కారం పెట్టిన మోహ‌న్ బాబు

Unstoppable : ఒకవైపు సినిమాలు.. మరోవైపు రియాల్టీ షోలతో రచ్చ రచ్చ చేస్తున్నారు బాలయ్య . ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో ‘అన్‌స్టాపబుల్’ అంటూ ఓ టాక్ షో ని ఓ రేంజిలో లేపుతున్నారు. తొలి ఎపిసోడ్‏లో మంచు మోహన్ బాబు కుటుంబసభ్యులపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక రెండో ఎపిసోడ్‏లో న్యాచురల్ స్టార్ నాని వచ్చారు. నవంబర్ 12న ఇది స్ట్రీమింగ్ అయింది.

balakrishnas unstoppable first episode making
balakrishnas unstoppable first episode making

తాజాగా తొలి ఎపిసోడ్‌ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను ‘ఆహా’ విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ ఎంట్రీ సాంగ్‌కు నటరాజ్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూరుస్తూ కనిపించారు. ఇక విరామ సమయంలో అల్లు అరవింద్‌తో బాలకృష్ణ ముచ్చట్లు చెబుతూ కనిపించారు.

మోహన్‌బాబు షోకు రాగానే రెండు చేతులూ జోడించి నమస్కరించారు. ఇక వేదికపై బాలకృష్ణ, మోహన్‌బాబుల మాటల సందడి ఎలా సాగిందో మీరే చూసి ఉంటారు. ఇకపోతే పూర్ణతో కలిసి బాలకృష్ణ ఎంట్రీ సాంగ్‌కు నటరాజ్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తుండటం, అలాగే విరామ సమయంలో అల్లు అరవింద్‌తో బాలకృష్ణ ముచ్చట్లు హైలైట్ సీన్స్ అయ్యాయి.

అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో విజ‌య్ సందడి చేయబోతున్నాడని సమాచారం. అల్లు అరవింద్ తో విజయ్‌కి మంచి అనుబంధమే ఉంది. గతంలో వీరి బ్యానర్ లో గీతా గోవిందం వంటి హిట్ వచ్చింది. అలాగే బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్‌తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య బాలయ్య.. ‘లైగర్’ సెట్స్‌కు వెళ్లాడు కూడా. దాంతో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఓ రేంజిలో క్లిక్ అవుతుందంటున్నారు.నందమూరి బాలకృష్ణను ఒక టాక్ షోలో హోస్ట్‌గా చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందులోనూ అది అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా కోసం అయ్యుంటుందని అసలే అంచనా వేసి ఉండరు. కానీ ఈ అనుకోని కలయిక సాధ్యమైంది