Balakrishna : బాలయ్య ఉద్దేశ్యపూర్వకంగా అన్నమాటలు కావు అవి
NQ Staff - January 24, 2023 / 09:48 PM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలో భాగంగా మాట్లాడుతూ ఆ రంగారావు.. ఈ రంగారావు, ఆ అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యలు చేశారు. సినిమా సక్సెస్ అయిన జోష్ లో.. వీర ఆవేశంలో బాలయ్య కాస్త నోరు జారాడు అంతే కానీ అవి ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కానే కావు అంటూ ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు.
హీరోగా బాలకృష్ణ సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఎన్నడూ కూడా తోటి కళాకారుల పట్ల అవహేళన చేసినట్లుగా ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడిందే లేదు, కానీ ఆయన యొక్క మాట తీరు కాస్త సౌమ్యంగా కాకుండా కఠువుగా ఉంటుంది అనే విషయం తెల్సిందే.
బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్థత్వం.. ఆయనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు. అలా మాట్లాడిన మాటలే అవి కానీ ప్రత్యేకంగా ఏ ఒక్కరిని కించపర్చే మాటలు కావు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
అక్కినేని హీరోలు ఇంత స్పీడ్ గా రియాక్ట్ అవ్వాల్సింది కాదని.. అక్కినేని వారిని గతంలో ఎన్నో సార్లు బాలయ్య గౌరవించాడు.. ఎన్నో సార్లు ఆయన విషయంలో పాజిటివ్ గా మాట్లాడాడు. అక్కినేని హీరోలకు బాలయ్య బాసటగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా నోరు జారిన మాటలకు ఇంతగా రాద్దాంతం అక్కర్లేదు అనేది కొందరి మాట.