Balakrishna: చిన్నారితో స‌ర‌దాగా ఆడుకుంటున్న బాల‌కృష్ణ‌.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

Balakrishna: నంద‌మూరి బాల‌కృష్ణ‌కి చిన్న పిల్ల‌లు అంటే చాలా ఇష్టం. ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న చిన్నారుల‌తో క‌లిసి తెగ సంద‌డి చేశారు. ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ షోలో నాని గెస్ట్‌గా వ‌చ్చిన స‌మ‌యంలో బాల‌కృష్ణ చిన్నారితో హంగామా చేశారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన నేచురల్ స్టార్ నాని బాలయ్యతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. షో మధ్యలోనాని బాలకృష్ణకు ఒక చిన్న అమ్మాయిని పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు.

balakrishna with his little fan
balakrishna with his little fan

మొదట్లో బాలయ్య ఆ అమ్మాయిని గుర్తు పట్టలేదు. దీంతో నాని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ సహాయంతో ఆ అమ్మాయికి చికిత్స జరిగిందని చెప్పాడు. కొన్నేళ్ల క్రితం తన ద్వారా సహాయం పొందిన చిన్నారిని ఇన్నేళ్ల తరువాత కలుసుకున్నందుకు బాలకృష్ణ సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత ఆమెను కలిసిన బాలకృష్ణ కొద్దిసేపటికే ఆమెను గుర్తు పట్టి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

ఇక తాజాగా బాల‌య్య చిన్నారితో క‌లిసి స‌ర‌దాగా ఆడుకుంటున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వీడియోలో చిన్న పాప తో బాలకృష్ణ ప్రేమగా ఉన్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. అఖండ చిత్రం షూటింగ్ సమయం లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు.

నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్‌ సిద్ధమైంది. టీజర్లు, ట్రైలర్లు భారీ హైప్ సాధించాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచ‌నాల‌ను అందుకుంది అఖండ‌.