Balakrishna : అఖండ కు జోడీగా అనసూయ.. అభిమానుల ఆంటీ గోల మళ్లీ వైరల్
NQ Staff - September 21, 2022 / 01:40 PM IST

Balakrishna ; నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు బాలకృష్ణ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Balakrishna with Anasuya Nandamuri Fans Aunty Trolls
నవంబర్ నెలలో ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటూ ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించాడు. సినిమాలోని హీరోయిన్స్ ఎవరు అనే విషయమే ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కి భారీ కి పారితోషికం ఇచ్చి అయినా ఆమెను ఈ సినిమాలో నటింపజేసేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాలో అనసూయ కనిపించబోతుంది అంటూ సమాచారం అందుతుంది. జబర్దస్త్ అనసూయ బాలయ్యకు జోడిగా ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తుంది.
అనిల్ రావిపూడి తాజాగా ఆమెను సంప్రదించాడని.. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వస్తున్నా వార్తలు నందమూరి Balakrishna అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు విభిన్నమైన ఐటెం సాంగ్ లను చేసిన అనసూయ కచ్చితంగా బాలయ్య తో చేయబోతున్న ఐటెం సాంగ్ నిలిచిపోయేలా ఉంటుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ ఐటెం సాంగ్ గురించి అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.