Balakrishna : పవన్ తో కంటే ముందు బాలయ్య తో ‘గబ్బర్ సింగ్‌’?

NQ Staff - January 25, 2023 / 04:29 PM IST

Balakrishna : పవన్ తో కంటే ముందు బాలయ్య తో ‘గబ్బర్ సింగ్‌’?

Balakrishna : గబ్బర్ సింగ్ సినిమా తో టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా పేరు దక్కించుకున్న హరీష్ శంకర్ త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం చాలా రోజులుగా హరీష్ శంకర్‌ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాను చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్‌ అనే పేరుతో సినిమాను హరిష్‌ శంకర్ చేయబోతున్నట్లుగా కొత్త ప్రకటన వచ్చింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు రాజకీయంగా బిజీగా ఉన్నాడు. దాంతో హరీష్ శంకర్ కి డేట్లు ఇచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు బాలకృష్ణతో హరీష్ శంకర్ ఒక సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ప్రచారం జరుగుతుంది.

ఇటీవల బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా యొక్క సక్సెస్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ పాల్గొన్నారు, దాంతో బాలకృష్ణ హీరోగా హరిష్‌ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తే అది కచ్చితంగా మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిజంగానే వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us