Balakrishna : బాలయ్య మంచి మనసు.. పిలవగానే ఇంటికి వెళ్లి భోజనం చేసిన నందమూరి హీరో
NQ Staff - July 26, 2022 / 09:27 AM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణకు అభిమాన గణం ఏ రేంజ్‌లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్యని చూస్తే అభిమానులకి పూనకాలు వస్తుంటాయి. ఆయన కొట్టినా, తిట్టినా కూడా బాలయ్యే తమ అభిమాన హీరో అంటూ కొందరు చెప్పుకొస్తుంటారు. ఒక్కోసారి సెట్‌కి వచ్చిన అభిమానులని బాలయ్య ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు, వారితో ఫొటోలు కూడా దిగుతుంటారు.

Balakrishna went lunch in fan house
బాలయ్యనా, మజాకానా?
తాజాగా బాలయ్య ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాలయ్య గతంలో ఓ అభిమానికి కలుస్తా అని మాటిచ్చారు. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచి వారి కుటుంబంతో కలిసి కలిసి భోజనం చేశాడు. అంతేకాకుండా వారితో ఆప్యాయంగా మాట్లాడాడు. దాంతో బాలయ్య అభిమానులు ‘కొట్టినా, పెట్టినా మా బాలయ్య బాబే’ అంటూ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూల్‌లో జరుగుతుంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, అక్కడకి వచ్చిన బాలయ్యను చూసేందుకు.. అభిమానులు భారీగా చేరుకున్నారు.
ఆయనతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఆయన కూడా ఏ మాత్రం విసుక్కో కుండా తనతో పాటు అభిమానులకు కలిసి ఫోటోలు దిగే అవకాశం ఇచ్చారు. బాలయ్య ఛాన్స్ ఇవ్వడంతో చాలామంద సెల్ఫీలు దిగారు. స్థానిక నాయకులు.. టీడీపీ ప్రముఖులు సైతం బాలయ్యను కలిశారు.