Veera Simhareddy : వీర సింహారెడ్డికి జగన్ ప్రభుత్వం నుండి మొదటి షాక్
NQ Staff - January 4, 2023 / 11:20 PM IST

Veera Simhareddy : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి ఈ నెల 12 న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలు లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఒంగోలులో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయి. ఈ సమయంలో ఒంగోలు పోలీసులు వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వడం కుదురదు అన్నట్లుగా తేల్చి చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఏం చేయాలో పాలుపోక మైత్రి మూవీ మేకర్స్ వారు జుట్టు పీక్కుంటున్నారు. వైజాగ్ లో లిమిటెడ్ జనాలతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. మరి మైత్రి మూవీ మేకర్స్ వారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఏపీలో వీర సింహారెడ్డి సినిమాకు కచ్చింగా జగన్ ప్రభుత్వం నుండి కష్టాలు తప్పవు అంటూ నందమూరి అభిమానులు గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నారు. అంతా అనుకున్నట్లుగానే వీర సింహారెడ్డి యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అడ్డుకోవడంతో జగన్ ప్రభుత్వం బాలయ్య పై కక్ష సాధిస్తున్నారు అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
వీర సింహా రెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా మైత్రి మూవీ మేకర్స్ వారు వ్యూహం ను మార్చుకున్నారు అనేది కొత్త సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.