Balakrishna : వీర సింహారెడ్డి బ్రేక్‌ ఈవెన్ కు ఇంకా ఎంత దూరంలో ఉంది

NQ Staff - January 23, 2023 / 07:33 PM IST

Balakrishna : వీర సింహారెడ్డి బ్రేక్‌ ఈవెన్ కు ఇంకా ఎంత దూరంలో ఉంది

Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి సీజన్ ని ఉపయోగించుకొని బాగానే వసూలు రాబట్టినట్లుగా సమాచారం అందుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రూ. 75 కోట్ల ఫ్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఆ స్థాయిలో వీర సింహారెడ్డి సినిమా వసూళ్లు రాబడుతుందా అనేది అందరిలో ఆసక్తికరమైన రేకెత్తించింది.

ఇప్పటి వరకు 67 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని ఈ చిత్రం రాబట్టిందని.. మరో వారం రోజుల్లో వీరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

బాలకృష్ణ కి జోడిగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో హనీ రోజ్ నటించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా కు పోటీగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకు పోటీగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంలో కాస్త వెనుకబడింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us