BalaKrishna-Vakeel Saab : బాలకృష్ణ నోట.. ‘వకీల్ సాబ్’ మాట..

BalaKrishna-Vakeel Saab : నందమూరి బాలకృష్ణ ఎంత సీరియస్ గా ఉంటారో అంత సరదాగా కూడా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడూ సినిమా ప్రోగ్రామ్స్ కి హాజరయ్యే బాలయ్య.. అభిమానులని నవ్వించటం కోసం చిలిపి కామెంట్స్ సైతం చేస్తారు. ఓ యువకుడు తొలిసారి హీరోగా నటిస్తుండటంతో ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమానికి బాలకృష్ణ వచ్చారు. ఆ హీరోని ‘‘నువ్వు వర్జిన్ కదా. అంటే నా ఉద్దేశం నువ్వు హీరోగా తొలి మూవీ చేస్తున్నావు కదా’’ అంటూ బాలకృష్ణ చమత్కరించారు. దీంతో వేదిక మీద ఉన్నోళ్లంతా హ్యపీగా నవ్వారు. ఇది జరిగి దాదాపు 5 నెలలు కావొస్తోంది. ఇప్పుడెందుకు దీని గురించి చర్చించుకోవటం అంటే ఇవాళ శుక్రవారం ఆ పిక్చర్ ట్రైలర్ ని విడుదల చేశారు. అందులో అప్పుడు బాలయ్య పేల్చిన వర్జిన్ అనే డైలాగ్ ని యాడ్ చేశారు. నిజానికి ఆ రోజు ఆ కుర్ర హీరో పుట్టిన రోజు. అందువల్ల ‘‘ఇవాళే పుట్టిన అతనికి పాపం, పుణ్యం ఏమీ తెలియవు’’ అని కూడా బాలకృష్ణ అప్పట్లో జోకులు పేల్చేరు. బాలయ్య చేసిన ఈ కామెడీ పార్ట్ ని ఇవాళ్టి టీజర్ లో ముందుగానే చూపించారు.

BalaKrishna-Vakeel Saab : balakrishan used the word virgin
BalaKrishna-Vakeel Saab : balakrishan used the word virgin

అయితే ఏంటి?..

ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ ట్రెండ్ నడుస్తోంది. అందులోని ఒక డైలాగ్ బాగా చర్చనీయాంశం అవుతోంది. అదే.. ‘‘ఆర్ యూ ఏ వర్జిన్?’’. విలన్ తరఫున అడ్వొకేట్ ప్రకాష్ రాజ్, హీరోయిన్ల తరఫున ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కోర్టులో కేసు విచారణలో భాగంగా ఈ మాటను వాడతారు. వర్జిన్ అనే పదం వినబడితే చాలు వందేళ్లయినా ‘వకీల్ సాబ్’ సినిమాయే గుర్తొచ్చేలా ఈ డైలాగ్ అంత పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోలు ట్రెండ్ సెట్ చేస్తారు తప్ప ట్రెండ్ ఫాలో అవ్వరు. చిన్న హీరోలు అలాంటి పెద్ద హీరోలు క్రియేట్ చేసిన ట్రెండ్ ని ఫాలో కావటమే. అందుకే ఐదు నెలల కిందట బాలకృష్ణ చేతుల మీదుగా ఫస్ట్ లుక్, ఈ రోజు శుక్రవారం టీజర్ రిలీజ్ అయిన ఆ కొత్త సినిమా యూనిట్ కూడా ‘వకీల్ సాబ్’ ట్రెండ్ ని ఫాలో అయ్యారు. నాడు బాలయ్య బాబు ఉపయోగించిన వర్జిన్ అనే పదానికి ఇప్పుడు బాగా పాపులారిటీ వచ్చేసింది కాబట్టి టీజర్ లో వాడేసుకున్నారు. అదీ సంగతి.

సంస్థ పేరు పైన సెటైర్: BalaKrishna-Vakeel Saab

ఇంతకీ ఆ కొత్త మూవీ పేరేంటంటే.. సెహారి. ఆ కుర్ర హీరో పేరు హర్ష్ కనుమిల్లి. ఈ చిత్రాన్ని ‘వర్గో పిక్చర్స్’ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. అసలు ఈ ప్రొడక్షన్ హౌజ్ కి వర్గో అనే పేరుకి బదులు వర్జిన్ అనే పేరు పెడితే బాగుండని బాలకృష్ణ ఆ రోజే హాస్యపూరితంగా అభిప్రాయపడ్డారు. ఐదు నెలల కిందట జరిగిన ఈ సెహారి సినిమా ఫస్ట్ లుక్ ప్రోగ్రామ్ లోనే మరో వింత చోటుచేసుకుంది. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ బాలకృష్ణ బిజీగా ఉండగా ఆయన ఫోన్ ఒక్కసారిగా మోగింది. దీంతో బాలకృష్ణ చిరాగ్గా దాన్ని పక్కకు విసిరేశారు. ఆ సీన్ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇంతకీ ఈ వర్గో పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించింది ఎవరు అంటే అద్వయ జిష్ణురెడ్డి. అతను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మేనల్లుడు. కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ పరిచయం వల్లే బాలయ్య బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.

Advertisement