Balakrishna unstoppable : నందమూరి బాలకృష్ణ హవా ప్రస్తుతం మాములుగా లేదు. ఆయన పట్టిందల్లా బంగారంగానే మారుతుంది. అఖండ సినిమా హిట్‌తో పాటు బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాడు. మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సరికొత్తగా అన్‌స్టాపబుల్ విత్ NBK అనే ఒక టాక్ షోను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఎంతో సరదాగా కొనసాగిన ఆ టాక్ షో ద్వారా బాలయ్య బాబు తన అభిమానుల సంఖ్యను మరింత పెంచుకున్నాడు.

నందమూరి బాలకృష్ణకు ఎంత కోపం ఉన్నా కూడా వెంటనే కూల్ అయిపోతారు అని ఆయనకు దగ్గరగా ఉండేవారు చెబుతూనే ఉంటారు. ఇక మిగతా హీరోలతో కూడా బాలయ్య బాబు ఎంత స్నేహంగా ఉంటారో అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా చాలా క్లారిటీ గా అర్థమైపోయింది. గెస్ట్ ఎవరైనా సరే చాలా ఎనర్జీ గా ఉండేలా బాలయ్య బాబు వారిని మార్చేస్తు ఉంటారు.
గత కొద్ది రోజులుగా ఈ టాక్ షో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంది. ఇప్పటికే ఈషోలో మోహన్ బాబు, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, కీరవాణి, రానా సందడి చేశారు. తాజాగా ఈ షోలో బాలయ్యతో కలిసి లైగర్ చిత్రయూనిట్ సందడి చేయనుంది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు అతిథులుగా వచ్చారు.
ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా తెలియజేసింది. లైగర్ చిత్రయూనిట్ చేసిన అల్లరి ఎపిసోడ్‌ను జనవరి 14న టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న లైగర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి అనన్య టాలీవుడ్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.