BALA KRISHNA: ఇద్ద‌రు హీరోయిన్స్‌తో బాల‌య్య రోమాన్స్.. క‌థ కేక పెట్టిస్తుందంటున్న మేక‌ర్స్

BALA KRISHNA నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ అనే ప‌వ‌ర్ ఫుల్ చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇది పూర్త‌య్యాక‌.. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని పవర్‌ఫుల్ మాస్ సబ్జెక్ట్‌తో సినిమా చేయనున్నారు. బాల‌య్య‌. మే లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా పట్టాలెక్కడానికి టైమ్ పట్టేలా ఉంది. ప్ర‌స్తుతం అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలు పెట్టాడు గోపీచంద్ మలినేని.

balakrishna controversial comments in hindupur municipal elections

బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఫ్యాక్షనిస్ట్‌గా క‌నిపించ‌నున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించనుంది. అయితే ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టించ‌నున్నారని, వారి పాత్ర‌లు పూర్తి వైవిధ్యంగా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పూర్తైన వెంట‌నే ఆ క‌థానాయిక‌ల వివ‌రాలను అనౌన్స్ చేయ‌నున్నార‌ట‌. కాగా ఈ చిత్రం రియ‌ల్ స్టోరీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇటీవ‌ల ద‌ర్శ‌కుడ వేట‌పాలెం వెళ్లి అక్క‌డ ప‌రిస్థితుల వివ‌రాల‌ను పూర్తిగా సేక‌రించాడ‌ట‌.

Advertisement