BalaKrishna: డ్యాన్స్‌తో దుమ్ములేపిన బాలయ్య

BalaKrishna: నందమూరి బాలకృష్ణ… తెలుగు ఇండస్ట్రీకి ఈ పేరు సుపరిచితం. ఆయన తీసిన సినిమా రిలీజ్ అవుతుందంటే నందమూరి ఫ్యాన్స్‌కి పండగే. క్యారెక్టర్ ఎలాంటిదైనా దానికి చెమటలు పట్టిస్తాడు బాలయ్య. ఆయన ఓ క్యారెక్టర్‌లోకి దిగితే ఇక ఆ క్యారెక్టర్‌లో వేరే వారిని ఇమాజిన్ చేసుకోవడం కష్టం. ఫ్యాక్షన్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్, క్లాస్ ఇలా క్యారెక్టర్ ఏదైనా బాలయ్య ఎంట్రీ ఇచ్చాడంటే ఇక సీన్ చిరిగిపోవాల్సిందే. ఆరు పదుల వయస్సులో ఉన్న ఆయన.. సినీ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ ఎప్పటికప్పుడు సవాల్ విసిరే క్యారెక్టర్స్ చేస్తుంటారు. నటన అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే నటన అన్న తీరులో ఆయన టాలీవుడ్‌లో ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయనను నటసింహం అని పిలుస్తుంటారు. సినిమాలోనే కాదు వివిధ ప్రోగ్రామ్స్‌లో సైతం పాల్గొంటున్న ఆయన.. డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తాడు. స్టేజిపైన ఆయన డైలాగ్ చెబితే.. ఫ్యాన్స్ ఆనందాన్ని కంట్రోల్ చేయడం కష్టమే. ఆ వయస్సులోనూ ఆయన వేసే స్టేప్పులు చూస్తే మతిపోవాల్సిందే. నటనలోనే కాదు డ్యాన్స్‌లోనూ తనకు ఎవరూ పోటీలేరని ఎప్పటికప్పుడు ఆయన ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు.

తాజాగా ఆహా ఒరిజినల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (నందమూరి బాలకృష్ణ) ప్రోగ్రాంలో బాలయ్య తన ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఆయన ఎంట్రీ ఇస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. స్టేజిపైకి ఎంట్రీ ఇస్తూనే బ్యాగ్రౌండ్ నుంచి వస్తున్న మ్యూజిక్‌కు ఆయన మాస్ స్టెప్పులు వేస్తుంటే.. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వయస్సులోనూ ఇంత ఎనర్జీతో దుమ్ములేపుతున్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆయన వేస్తున్న స్టెప్పులు చూసి ఫ్యా్న్స్ సైతం డ్యాన్స్ వేయడం మొదలెట్టారు. మరి అదీ బాలయ్య అంటే.. ‘వన్స్ ఐ స్టెపిన్ ఇస్టరీ రిపీట్’ అనే డైలాగ్ రీల్ లోనే కాదు.. రియల్‌గానూ ఆయన సొంతమని నిరూపించుకుంటున్నాడు బాలకృష్ణ. మరి ఆయన స్టెప్పులేస్తూ దుమ్ములేపిన వీడియోను మీరూ చూడండి.