తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా బాల‌య్య నుండి రానున్న స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలుసా?

విశ్వ విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ తెలుగు తెర‌పై తిరుగు లేని రికార్డులు న‌మోదు చేశాడు. బాల‌కృష్ణ న‌టించిన చాలా చిత్రాలు థియేట‌ర్స్ వంద‌కు పైగా రోజులు న‌డిచాయి. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో చిరంజీవి త‌ర్వాత మళ్లీ అంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు బాల‌కృష్ణ అని నిక్క‌చ్చిగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఆయ‌న రేపు త‌న తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమానుల‌కు ట్రీల్ ఇవ్వ‌బోతున్నారు.

రేపు బాల‌య్య ఆలపించిన శ్రీరామ దండకం ను 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ వారు తెలిపారు. ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందా అనే దానిపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌నకు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మేలో విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్ ఫ్యాన్స్ కు పిచ్చెంక్కించింది.