Balakrishna: శ్రీదేవి కాళ్లు తొక్కి, న‌డుముపై గిచ్చి నాన్న డ్యాన్స్ చేయించారు: బాల‌య్య‌

Balakrishna: బాల‌కృష్ణ ఈ మధ్య ఇంట‌ర్వ్యూల‌లో చేసే కామెంట్స్ ఎంత వివాద‌స్ప‌దం అవుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్లాసిక్ మూవీ ఆదిత్య 369 చిత్రం ఇటీవల 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య ఓ మీడియా ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో సినిమాకు సంబంధించిన మ‌ధురానుభూతులు నెమ‌ర‌వేసుకుంటూనే మ‌ధ్య‌మ‌ధ్య‌లో సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Balakrishna

‘రెహమాన్ ఎవరో నాకు తెలియదు. నేను పట్టించుకోను. పదేళ్లకు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్.. అందుకే ‘భారతరత్న’ అంటే రామారావు చెప్పుతో సమానం.. కాలి గోటితో సమానం అన్నాను చివరికి. ఇచ్చినోళ్లకు గౌరవం కానీ.. ఆయనకు గౌరవం ఏంటి? పదవులకు ఆయన అలంకారం ఏమో కానీ.. ఆయనకు పదవులు ఎప్పుడూ అలంకారం కాదు అని అన్నాను అంటూ వీరావేశంగా మాట్లాడారు.

సిల్క్ స్మిత గురించి మాట్లాడిన‌ బాలయ్య .. ఆదిత్య 369 సినిమాకు ముందు సిల్క్ స్మితకు ఉన్న ఇమేజ్ వేరు. ఆ సినిమాతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. సిల్క్ స్మిత డ్యాన్సరే కావొచ్చు. కానీ ఆమె వేసుకొనే క్యాస్టూమ్స్, మేకప్ గురించి టాప్ హీరోయిన్లు ఆరా తీసేవారు. శ్రీదేవి లాంటి వాళ్లు కూడా ఆమె మేకప్, దుస్తులను అనుకరించే వాళ్లు అని బాలకృష్ణ చెప్పారు.

గొప్ప డ్యాన్సర్లు అనుకొనే శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కొరియోగ్రాఫ‌ర్స్ ని దించేశారు. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చూసి ఆమె స్టెప్పులను దించేశారు. శ్రీదేవి లాంటి నటీనటులకు నాన్నగారు (స్వర్గీయ రామారావు) కాళ్లు తొక్కి డ్యాన్స్, యాక్టింగ్ నేర్పించారు. వీపుపై గుద్దులు గుద్ది, నడుముపై గిచ్చి, పిర్రలపై గుద్ది నాన్నగారు నేర్పించారు. వాళ్లు చాలా నాజుకుగా డ్యాన్స్ చేసేవారు. కానీ నాన్న గారు చాలా రఫ్ కదా.. వాళ్ల కాళ్లు తొక్కి డ్యాన్స్ నేర్పించారు అని బాలకృష్ణ అన్నారు.

Balakrishna స్టేటస్ కోసం ఎప్పుడూ తాను పాకులాడను అంటూ ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే దేశ అత్యున్న‌త పుర‌స్కారం భార‌ర‌త్న‌ను కించ‌పరిచి మాట్లాడడం, హీరోయిన్‌పై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం చాలా పెద్ద త‌ప్పు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి దీనిపై బాల‌య్య ఏమైన క్లారిటీ ఇస్తాడా అనేది చూడాలి.

‘ఆదిత్య 369’ కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999 మాక్స్’ సినిమా చేయనున్న బాల‌య్య‌.. సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ సినిమా ద్వారా తన తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ‘ఆదిత్య 999 మాక్స్’ చిత్రాన్ని 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు. అఖండ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని, అనీల్ రావిపూడి, పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నారు బాల‌య్య‌.