Balakrishna: కారంచేడులో బాల‌య్య సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్.. గుర్ర‌మెక్కిన నంద‌మూరి హీరో

Balakrishna: సంక్రాంతి పండుగ వేడుక‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు ప‌ల్లెటూర్ల‌లో పండుగ జ‌ర‌పుకుంటూ తెగ సంద‌డి చేస్తున్నారు. సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లా కారంచేడులో సందడి చేశారు.

balakrishna-sankranti-celebrations-at-his-sister village (1)
balakrishna-sankranti-celebrations-at-his-sister village (1)

సంక్రాంతి పండగ సందర్భంగా బాలకృష్ణ సోదరి, ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇంటికి బాలయ్య విచ్చేశారు. భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ కూడా వచ్చారు. నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి కుటుంబం కలిసి కారంచేడులో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

నిత్యం రాజకీయ,సినిమా పనుల్లో బిజీగా ఉండే బాలకృష్ణ.. ఈ రెండు రోజులు చిల్ అవ్వబోతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ ఫ్యామిలీ కూడా కారంచేడు చేరుకున్నారు . ప్రతీ సంక్రాంతిని కారంచేడులో దగ్గుబాటి ఫ్యామిలీ ఘనంగా గా జరుపుకుంటారు. అందులో నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా కొంత మంది హాజరవుతుంటారు. అయితే ప్రతీసారి .. బాలయ్య సతీమని వసుందర మాత్రమే ఎక్కువగా ఈ సంబరాలకు హాజరు అయ్యేవారు.

నందమూరి కుటుంబ సభ్యులు కారంచేడుకు వచ్చారని తెలిసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నిబంధనల దృష్ట్యా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటి వద్దకు ఎవర్నీ అనుమతించలేదు. బోగి మంటల అనంతరం.. దగ్గుబాటి, నందమూరి కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి.

తాజాగా బాల‌కృష్ణ ఆయ‌న త‌న‌యుడు గుర్రమెక్కి సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. అయితే నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యంలో అక్కడికి చేరుకోవడంతో సందడి వాతావరణం ఏర్పడింది. కాని కరోనా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఎవరిని లోపలకి అనుమతించడం లేదు. అభిమానులకు దూరంగా ఉండే అభివాదాలు చేశారు బాలయ్య . అక్కడ అందరిని ఆప్యాయంగా పలకరించారు.