Unstoppable 2 Show : అన్‌స్టాపబుల్: బాలయ్యా.! నిజాలు చెప్పించవయ్యా.!

NQ Staff - December 25, 2022 / 04:02 PM IST

Unstoppable 2 Show : అన్‌స్టాపబుల్: బాలయ్యా.! నిజాలు చెప్పించవయ్యా.!

Unstoppable 2 Show : అన్‌స్టాబుల్ రాను రాను బోర్ కొట్టేస్తోంది. ఔను, నందమూరి బాలకృష్ణ ‘ఆహా ఓటీటీ’ కోసం నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

త్వరలో ప్రభాస్, గోపీచంద్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్.. ఇలా బోల్డంత హంగామా వుండబోతోంది. ఇటీవల ముగ్గురు హీరోయిన్లతో బాలకృష్ణ అన్‌స్టాపబల్ షో చేశారు. అది స్ట్రీమింగ్ అవుతోంది.

అలనాటి అందాల తారలతో..

జయప్రద, జయసుధ.. అలనాటి అందాల తారలు. ఒకరేమో అందానికే కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరేమో సహజనటి. ఈ ఇద్దరితోపాటు, నేటితరం అందాల రాశి.. రాశీ ఖన్నా కూడా ఈ టాక్ షోలో పాల్గొంది.

సినీ పరిశ్రమలో మహిళలకు అవకాశాలు.. తదితర అంశాలపై వున్నది వున్నట్లుగా చెప్పడంలో సీనియర్ నటీమణులు మొహమాటపడ్డారు. రాశి ఖన్నా తొలుత గట్టిగా నిలబడినా, ఆ తర్వాత లైట్ తీసుకుంది. అంతా స్క్రిప్టెడ్ వ్యవహారమే అయితే, అక్కడ బాలయ్య ఎందుకు.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

హీరోయిన్లు కెరీర్ విషయంలో కొన్ని కాంప్రమైజెస్‌కి ఒప్పుకోవాల్సి వుంటుందనీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి నిర్మాతలు సంకోచిస్తారనీ.. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా బాలయ్య సహా, అక్కడున్న ముగ్గురు నటీమణులూ చెప్పారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us