BalaKrishna: ఏ ఆర్ రెహ‌మాన్ నాకు తెలియ‌దు, ప‌దేళ్లకు ఓ హిట్ ఇస్తాడు: బాల‌కృష్ణ‌

BalaKrishna: నంద‌మూరి బాల‌కృష్ణ ..వ‌ర్మ రూట్‌లో ప‌య‌నిస్తున్నాడా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో ప‌లు కామెంట్స్ చేస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటే,బాల‌య్య ఇంట‌ర్వ్యూల ద్వారా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నాడు.ఈ మ‌ధ్య బాల‌కృష్ణ చేసే వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. రీసెంట్‌గా మాకు సంబంధించి బాల‌య్య కొన్ని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఇప్ప‌టి వరకు ‘మా’ బిల్డింగ్‌ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు.

గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సినీ పెద్ద‌లు క‌లిసి వ‌స్తే ఇంద్ర‌భ‌వ‌నం నిర్మించుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు.ఇక తాజాగా ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు బాల‌య్య‌.

ఆదిత్య‌369 సీక్వెల్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పిన ఆయ‌న ఈ సినిమా ద్వారా తన త‌న‌యుడిని వెండితెర ఆరంగేట్రం చేయించ‌బోతున్న‌ట్టు మ‌రోసారి గుర్తు చేశారు. .. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు కూడా పేర్కొన్నారు.

ఇంట‌ర్వ్యూలో భాగంగా ఆదిత్య 369లో అన్నిపాట‌లు చాలా హిట్, జాణ‌వులేపాట ఇంకా హిట్ అని యాంక‌ర్ అన‌గానే, బాల‌య్య జిక్కీగారు పాడారు అని చెప్పారు.ఇళ‌య‌రాజా మ్యూజిక్ అద్భుతం అని చెబుతూ.. ప్రేక్ష‌కుడిగా, విమ‌ర్శ‌కుడిగా చెబుతాను. అది ఇళ‌య‌రాజా గారి మ్యూజిక్ అంటే ఎవ‌రు న‌మ్మ‌రు. ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది అంటూ రెహ‌మాన్ పేరు ఎత్తాడు.

రెహ‌మాన్ ఎవ‌రో నాకు తెలియదు. నేను ప‌ట్టించుకోను. ప‌దేళ్ల‌కు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్ .. అందుకే భార‌త‌ర‌త్న రామారావు గారంటే ఆయ‌న చెప్పుతో స‌మానం, కాలి గోటితో స‌మానం అన్నారు చివ‌రికి.ఇచ్చినోళ్ల‌కు గౌర‌వం కాని, ఆయ‌న‌కు గౌరవం ఏంటి? అనిని ఏదేదో చెప్పాడు బాల‌య్య‌. అస‌లు ఇళ‌య‌రాజా గురించి ప్రస్తావిస్తూ రెహ‌మాన్‌ని ఎందుకు విమ‌ర్శించాడో, మ‌ధ్య‌లో రామారావుని ఎందుకు తీసుకొచ్చాడో తెలియ‌క జ‌నాలు జుట్టు పీక్కుంటున్నారు.