Balakrishna: పురందేశ్వ‌రి ఇంట్లో సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకోబోతున్న బాల‌కృష్ణ‌

Balakrishna: అఖండ సినిమాతో పాటు అన్‌స్టాప‌బుల్ షో మంచి స‌క్సెస్ కావ‌డంతో ఆ జోష్‌లో ఉన్నారు బాల‌కృష్ణ‌. ఆ జోష్‌లోనే ఈ ఏడాది సంక్రాంతి పండుగ జ‌రుపుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు బాల‌య్య‌. నందమూరి బాలకృష్ణ దంపతులు గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లారు. అక్కాబావలైన డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకొనేందుకు కారంచేడులోని వారింటికి చేరుకున్నారు.

balakrishna celebrates sankranthi in his sister's house1
balakrishna celebrates sankranthi in his sister’s house1

నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధర వచ్చినప్పటికీ.. చాలా కాలంగా బాలకృష్ణ రాలేదు. ఈ సారి బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు. గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు.

సంక్రాంతి పండుగ వేడుక‌ల త‌ర్వాత బాల‌కృష్ణ తిరిగి త‌న ప‌నులు మొద‌లు పెట్ట‌నున్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా అఖండ గా గర్జించిన బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది.

బాలయ్య గెస్ట్ లుగా వచ్చిన స్టార్స్ తో తనదైన స్టైల్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో ఎనిమిది ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ షోను బాలయ్య తనదైన శైలిలో నడిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. మొదటి షో నుంచి అన్ స్టాపబుల్ గా సాగుతుంది ఈ టాక్ షో. మొదటి షోకు గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యారు.

balakrishna celebrates sankranthi in his sister's house
balakrishna celebrates sankranthi in his sister’s house

ఆ తర్వాత నాని బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, సుకుమార్, రష్మిక మందన్న, అల్లు అర్జున్, రవితేజ , గోపీచంద్ మలినేని, రానా, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ ఈ షోకు హాజరయ్యి ఆకట్టుకున్నారు. త్వ‌ర‌లో బాల‌కృష్ణ ..గోపిచంద్ మ‌లినేనితో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.