Balakrishna: బాల‌య్య బ‌ర్త్‌డే.. ఆ రెండు గిఫ్ట్‌లు ప‌క్కా అనుకుంటున్న ఫ్యాన్స్‌

Balakrishna: అభిమానులకు బాలకృష్ణ పుట్టినరోజు అంటే పండగ లాంటిది. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఇలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. కానీ బర్త్ డే రోజు వాళ్లను నిరాశ పరచడం లేదు. తన సినిమాలకు సంబంధించిన రెండు అదిరిపోయే సర్ప్రైజ్ లు ఫ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్నాడు నందమూరి నటసింహం. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా టీజరైతే యూ ట్యూబ్ లో సరికొత్త చరిత్ర తిరగరాసింది.

మరే సీనియర్ హీరోకు సాధ్యం కాని రీతిలో అఖండ టీజర్ అఖండమైన రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ కానీ లేదంటే ఒక పాటను బోయపాటి శ్రీను విడుద‌ల చేస్తార‌ని అంతా భావించారు. కాని ఒక రోజు ముందే అఖండ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ కానున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఫ్ర‌క‌టించింది. జూన్ 9 సాయంత్రం 4.36ని.ల‌కు బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ విడుద‌ల కానున్న‌ట్టు ద్వారకా క్రియేష‌న్స్ సంస్థ త‌మ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంద‌ని అంటున్నారు.

మరోవైపు గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా జూన్ 10న ఉండబోతుంది. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. వేటపాలెం నేపథ్యంలో అదిరిపోయే యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్నాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సూపర్ హిట్ కావడంతో అదే జోరులో బాలయ్య సినిమా మొదలు పెడుతున్నాడు గోపిచంద్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. జూన్ 10న ఈ రెండు సినిమాలకు సంబంధించిన బహుమతులు అభిమానుల ముందు ఉంచనున్నారు దర్శక నిర్మాతలు.