Balakrishna : బాలకృష్ణ వర్సెస్ రవితేజ.. ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ ..!

Balakrishna : బాలకృష్ణ వర్సెస్ రవితేజ.. తాజాగా నందమూరి నటసింహం తను నటిస్తున్న లేటెస్ట్ సినిమా బిబి3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సునామీ వచ్చినట్టు టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆచార్య, పుష్ప, వకీల్ సాబ్, సర్కారు వారి పాట, ఆర్ ఆర్ ఆర్, ఎఫ్ 3, నారప్ప, విరాట పర్వం, ఖిలాడి, మహా సముద్రం ..ఇలా 2021 దాదాపు 15 నుంచి 20 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కి డేట్ లాక్ చేసుకున్నాయి. ఇంకా కన్‌ఫర్మ్ కావాల్సిన సినిమాలు కూడా త్వరలో తమ రిలీజ్ డేట్స్ ని ఇచ్చేస్తాయంటున్నారు. తాజాగా బాలకృఇష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిబి3 మే 28 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

balakrishna-Balakrishna vs Ravi Teja .. ready to compete at the box office one day ..!
balakrishna-Balakrishna vs Ravi Teja .. ready to compete at the box office one day ..!

ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఒకేరోజు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు గాని మన టాలీవుడ్ హీరోలు గట్టిగానే పోటీ పడుతున్నారు. సాధారణ పరిస్థితులున్నప్పుడే నిర్మాతలు పరస్పరం ఒప్పందం మీద ఒక్కో సినిమాకి మధ్య కనీసం వారం అయినా గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. కాని ప్రస్తుతం ప్రకటించిన సినిమాల పరిస్థితి అలా లేదు. రానా అరణ్య.. నితిన్ రంగ్ దే ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకి ముందు వెనక కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

Balakrishna : బిబి3.. ఖిలాడి సినిమాలలో ఏ సినిమా సత్తా ఏంటో చూడాలి..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మే 13 న రిలీజ్ కాబోతుండగా మే 14న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప రాబోతోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ బిబి3, రవితేజ ఖిలాడి ఒకే రోజు అంటే మే 28 న రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకి కొన్ని థియేటర్స్ మూతపడ్డాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ ని ఎలా డివైడ్ చేసుకుంటారో చూడాలి. ఏదేమైనా టాలీవుడ్ లో మళ్ళీ దాదాపు సంవత్సరం తర్వాత కొత్త కళ వచ్చింది. అందరి హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఇక బాలకృష్ణ వర్సెస్ రవితేజ గా రిలీజ్ కాబోతున్న బిబి3.. ఖిలాడి సినిమాలలో ఏ సినిమా సత్తా ఏంటో చూడాలి.

Advertisement