Balakrishna : అఫీషియ‌ల్‌.. బాల‌య్య‌తో బ్ర‌హ్మీ,అనీల్ రావిపూడి ర‌చ్చ‌

Balakrishna : నందమూరి నటసింహాం బాల‌కృష్ణ‌ ఇపుడ సినిమాలతో పాటు అన్ స్టాప‌బుల్ అనే షోతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అన్‌స్టాప‌బుల్ షోని బాలయ్య స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపిస్తున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్ హాజరయ్యారు. ఈ షోకు ఆడియన్స్‌ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత బాలయ్య.. రెండో ఎపిపోడ్‌ను నాచురల్ స్టార్ నానితో టాక్ షో నిర్వహించారు.

Balakrishna and Anil Ravipudi movie update 1
Balakrishna and Anil Ravipudi movie update 1

ఈ షోలో నాని, బాలయ్య సరదగా చెప్పుకున్న కబుర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి.ఈ షోలో బాలయ్య ఎవరికి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మన ప్రయత్నానికి మనమే నారు పోసి.. నీరు పెట్టి.. కోత కోసి.. కుప్ప నూర్చి.. ఆ వరిని ఉడికించి మనమే వడ్డించుకోవాలి అపుడే జీవితం స్వర్గం అన్నారు.

Balakrishna and Anil Ravipudi movie update
Balakrishna and Anil Ravipudi movie update

‘అఖండ’ షూటింగ్ సమయంలో చేతికి గాయం కావడంతో డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో బాలయ్య ‘ఆహా’ కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఇక రీసెంట్‌గా జరిగిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా బాలయ్య చేతికి కట్టుతో హాజరయ్యారు. బాలయ్య మూడో ఎపిపోడ్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. మూడో ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌, అనీల్ రావిపూడి క‌లిసి సంద‌డి చేయ‌బోతున్నారు.

Balakrishna and Anil Ravipudi movie update 1
Balakrishna and Anil Ravipudi movie update 1

గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా జాతిరత్నాలు సినిమాలో కనిపించి నవ్వించారు. త్వరలోనే పంచతంత్ర, రంగమార్తాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో బాలయ్య షో లో ఆయ‌న సంద‌డి ఎలా ఉంటుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Balakrishna and Anil Ravipudi movie update
Balakrishna and Anil Ravipudi movie update

ఇక బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా.. రాజమౌళి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.