Akhanda: అఖండ‌కు గుమ్మ‌డికాయ కొట్టారు.. రిలీజ్ ఎప్పుడు చేస్తారో మ‌రి..!

Akhanda: క‌రోనా వ‌ల‌న చాలా చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాల‌కు బ్రేక్ ప‌డింది. కొద్ది రోజులుగా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్నాయి. బాలకృష్ణ న‌టిస్తున్న అఖండ సినిమా షూటింగ్ ఎప్పుడో మొద‌లు కాగా, ‘అఖండ’ సినిమాను మే 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అప్పుడు కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు.

Balakrishna Akhanda Movie Shooting completed
Balakrishna Akhanda Movie Shooting completed

అప్పటి నుంచి చిత్రీకరణ మాత్రం శరవేగంగా సాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో నందమూరి అభిమానులు అయోమయంగా ఉన్నారు. బాలకృష్ణ తన సినిమాలను వీలైతే సంక్రాంతికి .. లేదంటే దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ రెండు పండుగలు ఆయనకి సెంటిమెంట్.

ఈ సారి కూడా ఆయన దసరా బరిలోకి ‘అఖండ’ సినిమాను దింపుతారని అంతా అనుకున్నారు. అప్పటికి సినిమా పనులు పూర్తికావనే టాక్ రావడంతో, ఇక సంక్రాంతికి వస్తుందని భావించారు. కానీ ఈ రెండు పండగలకి మధ్యలో .. ‘దీపావళి’కి రావడానికి ‘అఖండ’ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.

‘అఖండ’ సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్‌కు అత్యధిక డీల్స్ వచ్చాయి.

గ‌త కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న అఖండ చిత్రం ఎట్ట‌కేల‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ విష‌యాన్ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించ‌నున్నారు.