Akhanda : అఖండ‌లోని ఈ గిత్త‌ల వెనుక క‌హానీ ఏంటో తెలుసా?

Akhanda : నందమూరి బాలయ్య నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ. ఈ సినిమా దూసుకుపోతుంది.. ఎక్కడ చూసిన అనూహ్య రెస్పాన్స్ తో అఖండ అఖండ విజయం సాధించింది. మొదటి షోనుంచి అఖండ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది.

Balakrishna Akhanda Bulls back story
Balakrishna Akhanda Bulls back story

అఖండ సినిమాలో కనిపించిన బసవన్నలు(కోడెలు) చౌటుప్ప ల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందినవే. గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన కోడెలకు కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లు పెట్టాడు. నిత్యం వాటికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చాడు. పేరు పెట్టి పిలిస్తే పలికేలా, చెప్పిన మాట వినేలా తయారు చేశాడు.

Balakrishna Akhanda Bulls back story
Balakrishna Akhanda Bulls back story

సొంత పని నిమిత్తం శ్రీనివాస్‌ గతేడాది రామోజీ ఫిలింసిటీకి వెళ్లాడు. అక్కడ షూటింగ్‌ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ వచ్చింది. దాంతో తన కోడెలకు సంబంధించిన వీడియోలు చూపించాడు. కోడెల నైపుణ్యం నచ్చిన నిర్వాహకులు షూటింగ్‌కు ఆహ్వానించారు. ఆ మేరకు ఏడాది క్రితం రామోజీ ఫిలింసిటీలో రెండ్రోజుల పాటు కోడెలు షూటింగ్‌లో పాల్గొన్నాయి.

చిత్రంలోని ప్రారంభ సన్నివేశంతో పాటు క్లైమాక్స్‌ సన్నివేశంలో ఇవి కన్పిస్తాయి. మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సినిమాకే వన్నె తెచ్చాయి. ప్రముఖ హీరోతో కలిసి ప్రధానమైన సినిమాలో తన కోడెలు నటించడం, చక్కటి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ తెలిపాడు.

అఖండ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించి ఆకట్టుకున్నారు. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు.

సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపించింది. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ అయ్యింది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించింది. త‌మ‌న్ మ్యూజిక్‌, ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్స్‌.

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తుంది. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో మంచి రేటుకే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సినిమాతో హాట్ స్టార్ కచ్చితంగా జాక్ పాట్ కొట్టినట్లే అంటూ ఓటీటీ విశ్లేషకులు కూడా అంటున్నారు.