Balakrishna : ఆదిత్య 999 పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన బాలయ్య
NQ Staff - November 19, 2022 / 10:23 AM IST

Balakrishna : నందమూరి బాలకృష్ణ తాజాగా విశ్వక్సేన్ సినిమా దమ్కీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఆదిత్య 369 యొక్క సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు. విశ్వక్సేన్ దమ్కీ సినిమా కు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించి నిర్మించిన విషయం తెలిసిందే.
తాను కూడా ఒక సినిమా కు దర్శకత్వం వహించాలని మొదలు పెట్టానని, కానీ ఆ సినిమా మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చిందని అని నర్తనశాల గురించి చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఒక సినిమా కు దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నట్లుగా కూడా బాలకృష్ణ ప్రకటించాడు.
వచ్చే సంవత్సరం ఆదిత్య 999 సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఆ సినిమాలో మోక్షజ్ఞ ఉంటాడని గతంలోని బాలకృష్ణ పేర్కొన్న విషయం తెలిసిందే. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది.
ఎప్పుడెప్పుడు సినిమా యొక్క పూజా కార్యక్రమం జరుగుతాయి.. షూటింగ్ మొదలవుతుంది అంటూ నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369 సినిమా బాలయ్య కెరీర్ లోనే ఒక అద్భుతమైన సినిమా అనడంలో ఇలాంటి సందేహం లేదు.
కనుక ఆ సినిమా సీక్వెల్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం ఖాయం. బాలయ్య స్వయంగా సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి అంటూ గతంలో ప్రచారం జరిగింది.
ఇప్పుడు అదే నిజమంటూ స్వయంగా బాలకృష్ణ అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా క్లారిటీ వచ్చేస్తుంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సినిమాను మొదలు పెడితే 2024లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.