BALA KRISHNA డైరెక్టర్ బి.గోపాల్ తరవాత నందమూరి బాలకృష్ణకు బాగా కనెక్ట్ అయిన దర్శకుడు బోయపాటి శీను. బాలయ్యలోని ఫైర్‌ను కరెక్ట్‌గా వాడుకుంటూ మంచి హిట్స్ ఇస్తుంటారు. ఇప్పటికే బాలయ్య-బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా ‘సింహా’ సినిమా ద్వారా కొత్త బాలకృష్ణను చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బోయపాటి శ్రీను. లెజెండ్తోను బాలకృష్ణ ఇమేజ్ను పెంచాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం రూపొందుతుండగా, ఈ సినిమా బీబీ 3 అనే టైటిల్‌తో ప్రచారం జరుపుకుంటుంది.
కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర టీజర్ విడుదల కాగా, ఇందులో బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ‘రాజు గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి.. రాజు గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’’ అంటూ బాలయ్య తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పి అభిమానులని ఆనందింపజేశాడు. ద్వారకా క్రియేషన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేయనుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల కోసం వికారాబాద్ జిల్లా కొట్టాలగూడా గ్రామంకు వెళ్లారు మూవీ యూనిట్.
షూటింగ్ జరిపేందుకు అంతా సిద్ధం చేసుకున్న సమయంలో సడెన్‌గా గ్రామస్తులు అందరు వచ్చి షూటింగ్‌కు అడ్డపడ్డారు. మా గ్రామంలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కబ్జా అయ్యాయి. వాటి పరిస్థితి ఏమంత బాగోలేదు. షూటింగ్ చేసుకోవాలంటే అభివృద్ధికి కొన్ని నిధులు ఇవ్వాలని అన్నారట. అయితే మేం షూటింగ్ అనుమతులు తీసుకున్నాం అని చెప్పిన కూడా వారు వినలేదట. చేసేదం లేక చిత్ర యూనిట్ షూటింగ్ మొదలు పెట్టకుండానే పేకప్ చెప్పారు. బాలకృష్ణ అక్కడకు చేరుకున్న తర్వాత ఈ సంఘటన జరిగిందా లేదా ముందే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అన టైటిల్ పరిశీలిస్తున్నారు.