Sharwanand-Rashmika: శ‌ర్వానంద్, ర‌ష్మిక చేతిలో పెద్ద కాజా.. బాహుబ‌లి కాజా భలేగుందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Sharwanand-Rashmika శ‌ర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ రాజమండ్రిలో మొదలైంది. ప్రధాన తారాగణంపై తెరకెక్కించనున్న కీలక సన్నివేశాలతో టాకీ భాగం పూర్తి కానున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ‘

ఈ మూవీని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
అక్టోబర్ 24న‌ ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం షూటింగ్‌ను చిత్రయూనిట్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు.

ఈ షెడ్యూల్‌తో దాదాపు టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి కానుంది. దసరా కానుకగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా అది ఫుల్ వైరల్ అయింది. శర్వానంద్, రష్మికలు నవ్వుకుంటూ ఎదురెదురుగా నిల్చున్న ఆ పోస్టర్‌కు అంతా ఫిదా అయ్యారు.

‘కుటుంబ వినోదంతో కూడిన చిత్రమిది. శర్వానంద్‌ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ అలరిస్తాడు. రష్మిక మందన్న పాత్ర ఓ మంచి అనుభూతిని పంచుతుంది. ఇతర మహిళల పాత్రలు అలరిస్తాయి. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన లభించింద’’ని సినీ వర్గాలు తెలిపాయి.

షూటింగ్‌లో పాల్గొన్న హీరో శర్వానంద్, హీరోయిన్‌ రష్మికలకు సురుచి పీఆర్‌ఓ వర్మ బాహుబలి కాజాలను అందజేశారు. శర్వానంద్‌ మాట్లాడుతూ తనకు మడత కాజా అంటే చాలా ఇష్టమని, గతంలో తాను సురుచిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారని వర్మ తెలిపారు.

చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్‌, ఊర్వశి, వెన్నెల కిశోర్‌, రవిశంకర్‌, సత్య, ప్రదీప్‌ రావత్‌, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ నటరాజన్‌, రాజశ్రీ నాయర్‌, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్‌ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.