Mahesh Babu : మ‌హేష్ అభిమానుల‌కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి అప్‌డేట్ లేన‌ట్టే..!

Mahesh Babu : క‌రోనా మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ ఏమో కాని సినీ ప్రేక్ష‌కుల‌కి వ‌రుస‌గా బ్యాడ్ న్యూస్ లే వ‌స్తున్నాయి. క‌రోనా వ‌ల‌న ఇప్ప‌టికే ప‌లు సినిమాలు వాయిదా ప‌డ‌గా, ఇప్పుడు అప్‌డేట్స్ కూడా వాయిదా వేస్తున్నారు.ప్రస్తుతం కరోనా బాగా విస్తరిస్తుంది. అంతేకాదు ఏకంగా మహేష్‌బాబు కరోనాతో బాధపడుతున్నారు. హీరోయిన్‌ కీర్తిసురేష్‌కి వైరస్‌ సోకింది. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

bad news for Mahesh Babu fans
bad news for Mahesh Babu fans

ఇలా `సర్కార్‌ వారి పాట` టీమ్‌లో చాలా మందికి కరోనా సోకిందని, దీంతో సినిమా నుంచి ఈ సంక్రాంతి అప్‌డేట్‌ రావడానికి ఆలస్యమవుతుందని తెలిపింది. ఎప్పుడనేది వెల్లడిస్తామని, అయితే పాట వెయింటింగ్‌కి సరిపడ వర్త్ తో ఉంటుందని, అప్పటి వరకు వెయిట్‌ చేయాలని వెల్లడించింది. ఈ సందర్భంగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే మహేష్‌బాబు కరోనా నుంచి కోలుకున్నారనే వార్త వైరల్‌ అయ్యింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఇక `గీతగోవిందం` ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్నారు. థమన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 14) థియేటర్లలో సందడి చేయాల్సింది. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌)ను జనవరి 7న రిలీజ్‌ చేస్తామని ప్రకటించడం, పలు కారణాలతో ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత ఏప్రిల్‌ ఒకటిన రిలీజ్‌ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే మళ్లీ తాజాగా ఈ డేట్‌కు కూడా విడుదల చేయడం అనుమానమే అంటున్నాయి సినీ వర్గాలు.

ఎందుకంటే మహేశ్ బాబుతో పాటు హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఇద్దరికి కూడా కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వీళ్లిద్దరూ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. ఇదే కాకుండా ఇటీవల మహేశ్‌ బాబుకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇలాంటి కారణాలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్‌ 1 తేదికి సినిమా పూర్తయ్యే సూచనలు కనిపించనట్లు తెలుస్తోంది.