BB5 Telugu: బిగ్ బాస్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. చెప్పిన టైంకి షో రావ‌డం క‌ష్ట‌మేనా?

BB5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా ఐదో సీజ‌న్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. గ‌త కొద్ది రోజులుగా షోకి సంబంధించి ఎన్నో ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌క అభిమానుల‌లో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


BB5 Telugu

షో ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని అభిమానుల‌లో సందేహాలు నెల‌కొని ఉండ‌గా, ఈ రోజు క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్ . సెప్టెంబర్‌ 5 నుంచి స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమో విడుదల చేశారు. సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తర్వాత ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుందని తెలియ‌జేశారు.


గత రెండు సీజన్లలో హోస్ట్ చేసిన నాగార్జున ఈ ఐదవ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే ఇప్పుడు ఈ షో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మొదలవుతుందా లేదా అనే దాని మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అందుకు కార‌ణం క‌రోనా అంటున్నారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ లను కొన్ని స్టార్ హోటల్స్ లో క్వారంటైన్ చేశారు.


ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం మేర‌కు క్వారంటైన్‌లో ఉన్న కొంద‌రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ట‌. అందుకే షో వాయిదా పడే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి ప్రచారమే కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మ‌రోవైపు ఇవ‌న్నీ అవాస్త‌వాలే అంటున్నారు. కొంద‌రికి క‌రోనా వ‌చ్చినా కూడా వారి స్థానంలో వేరే వారిని ఎంపిక చేసే ఆప్ష‌న్‌ని కూడా నిర్వాహ‌కులు ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నార‌ట‌.

ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం మేరకు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, టెలివిజన్ యాంకర్ రవి, నటి ప్రియా, ఆర్జే కాజల్, యాంకర్ లోబో, లహరి, సరయు కోయిలమ్మ ఫేమ్ మానస్, వీజే సన్నీ, యానీ మాస్టర్, టీవీ9 యాంకర్ ప్రత్యూష ఈ షో కోసం ఎంపికైనట్లు గా చెబుతున్నారు. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణ లోడ్ ఎత్తాలి రా అనే డైలాగ్ తో పాపులర్ అయిన కుమనన్ సేతురామన్ కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి 100 రోజుల పాటు జరగ‌నుంది.