PAWAN KALYAN: బ్యాక్ టూ బ్యాక్ స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్న వీర‌మ‌ల్లు.. ఫ్యాన్స్‌లో వెల్లువెత్తిన ఆనందం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెబితే ఆయ‌న అభిమానుల‌కు పూన‌కాలు వ‌స్తుంటాయి. రాజ‌కీయాల వ‌ల‌న మూడు సంవ‌త్స‌రాలు సినిమాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న ఎట్ట‌కేల‌కు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌గా ఉన్నారు. ప‌వ‌న్ న‌టిస్తున్న త‌దుప‌రి సినిమాల‌పై చాలా ఆస‌క్తితో ఉన్నారు. ముఖ్యంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాపై చాలా ఇంట్రెస్ట్‌గా ఉ్న‌నారు. తొలిసారి ప‌వ‌న్ చారిత్రాత్మ‌క చిత్రం చేస్తున్న నేప‌థ్యంలో ఈ సినిమాలో ప‌వ‌న్ ఎలా అల‌రిస్తాడని అంద‌రు చ‌ర్చ‌లు జ‌రుపుకుంట‌న్నారు.

గతంలో ఎప్పుడు కూడా ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమా ను చేయని పవన్ మొదటి సారి క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా చాలా పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చిన్న వీడియో వచ్చి మరింతగా సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్న టీజ‌ర్ విడుద‌లై సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. ఈ సినిమా నుండి మ‌రిన్ని అప్‌డేట్స్ కావాల‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమా నుండి మరిన్ని సర్ ప్రైజ్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ బర్త్ డే సందర్బంగా టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఆగస్టులో నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారనే టాక్ వస్తుంది. సంద‌ర్భానుసారం మూవీ నుండి ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తూ మూవీ ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెడుతున్నారు. పవన్ ను ఈ సినిమాలో క్రిష్ దొంగగా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్ వచ్చింది. ఆ సినిమా పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెస్ కూడా న‌టిస్తుంది.