Baby movie heroine to enter Bigg Boss house : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బేబీ హీరోయిన్.. ఇక మామూలుగా వుండదు..

NQ Staff - July 21, 2023 / 06:30 PM IST

Baby movie heroine to enter Bigg Boss house : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బేబీ హీరోయిన్.. ఇక మామూలుగా వుండదు..

Baby movie heroine to enter Bigg Boss house : బేబీ సినిమా హిట్ తో హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు గత వారం రోజులుగా ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఈ సినిమాతో ఈమె ఎనలేని క్రేజ్ సంపాదించు కుంది.. ఇంతకు ముందు వరకు ఈమెకు ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ లేదు.. ఈ సినిమా చిన్న సినిమాగా తెరకెక్కి ఇప్పుడు సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది..

యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. హీరో కంటే కూడా హీరోయిన్ కు మాములుగా క్రేజ్ దక్కలేదు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ అంటే యూత్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. దీంతో ఎక్కడ విన్న ఈమె పేరునే వినిపిస్తుంది.

మరి ఈ క్రేజ్ ను బిగ్ బాస్ కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు టాక్ వస్తుంది. ఎందుకంటే అతి త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు కష్టపడుతున్నారు. ఇప్పటికే కొత్త ప్రోమో కూడా రిలీజ్ చేసి అతి త్వరలోనే సీజన్ స్టార్ట్ అని ప్రకటించారు.

మరి ఈ సీజన్ గురించి ప్రోమో వచ్చినప్పటి నుండి కంటెస్టెంట్స్ పేర్లు మారుమోగి పోతున్నాయి. ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. మరి తాజాగా ఈ లిస్టులోకి బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా వచ్చేసింది.. ఈమెను బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్ లోకి తీసుకు రావాలని అనుకుంటున్నట్టు టాక్ రావడంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us